March 2026


స్వర్ణరథంపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి కటాక్షం


తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు.

స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం.


*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి హిందూ దేవాలయాల భూముల ఆక్రమణ పై వినతి పత్రం సమర్పించడం జరిగింది*

*విషయం: హిందూ దేవాలయ భూముల రక్షణ, అక్రమణల నివారణ శిధిలావస్థ లో ఉన్న ఆలయాలు పునఃనిర్మాణం మరియు ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై  వినతిపత్రం*

హిందూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. ఈ ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు దేవుని ఆస్తులు, కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలు. అయితే ప్రస్తుతం ఈ భూముల విషయంలో జరుగుతున్న పరిణామాలు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఈ మధ్య ఆకివీడు రామాలయ పునఃనిర్మాణం లో జరిగిన అల్లర్లు, నవమి రోజున జరిగిన దాడులు స్వయంగా స్పీకర్ నే హత్య చేయాలనుకునే ప్రయత్నం  పై యావత్ హిందు సమాజం ఆందోళనకు గురవుతుంది. సంవత్సరాలు గా ఆలయాల పునఃనిర్మాణాలు జరగకపోవడం వలన హిందు సమాజం నష్టపోతుంది. రాష్ట్రంలో శిధిలావస్థలో ఉన్న అన్ని ఆలయాలు పునఃనిర్మించాలి.

హిందు ఆలయాల మొత్తం భూమి సుమారు 4.7 లక్షల ఎకరాలు, 1.5 లక్షల ఎకరాలు అక్రమణకు గురయ్యాయి, అభివృద్ధి పేరు తో 8000 ఎకరాలు ప్రభుత్వం తీసేసుకుంది. లక్షల కోట్ల విలువ చేసే భూములు హిందు ఆలయాల నుంచి  మల్లించబడుతున్నాయి మరియు ఆక్రమించబడుతున్నాయి.

దేవాలయాలకు సంబంధించిన లక్షన్నర ఎకరాలకు పైగా భూములు “ప్రైవేట్ వ్యక్తుల సర్వే నంబర్లలో కలిసిపోయాయి” అనే పేరుతో సరైన ధర్యాప్తు చేయకుండా, ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఇది హిందూ సమాజానికి, ఆలయ రక్షణకు తీవ్రమైన ప్రమాదకరం. ఈ చర్యలు ద్వారా ఆలయాలు తీవ్రంగా నష్టపోతాయి.

అలాగే, GO No. 139 ద్వారా 33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల పేరుతో అర్బన్ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే విధానం కూడా పూర్తిగా వ్యతిరేకించదగినది. ఈ నిర్ణయం వల్లే హిందూ సమాజం కోర్టులను ఆశ్రయించి స్టే ఆదేశాలు తెచ్చుకోవలసిన పరిస్థితి వచ్చింది.

హిందూ ఆలయ భూములు అభివృద్ధి పేరుతో ఇతరుల చేతుల్లోకి వెళ్లడం అంగీకారయోగ్యం కాదు.
హిందూ ఆలయ భూములు ఆలయాలకే చెందాలి ఇదే భారతీయ జనతా పార్టీ స్పష్టమైన అభిప్రాయం. ఇంకా, ఆలయ భూములను ఆక్రమించుకున్న వారికి రెగ్యులరైజేషన్ పేరుతో చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ఆలోచించడం కూడా అత్యంత ప్రమాదకరం. ఇది అక్రమాలను ప్రోత్సహించడమే అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో  కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుంది. ఆలయ భూముల రక్షణలో కూడా ఆ పారదర్శకత ఉండాలి.

ప్రస్తుతం పరిస్థితులు చూస్తే, గత ప్రభుత్వ ఆలోచనలు కొనసాగిస్తూ కొంతమంది అధికారులలో ఆలయ భూములను రక్షించాలనే దృక్కోణం కాకుండా, వాటిని దారి మళ్లించాలి, దోచిపెట్టాలి అనే ధోరణి కనిపించడం హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తోంది. ఇటువంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేము.

దేవాలయాల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ, అదే ఆలయాల అభివృద్ధి, పండుగల నిర్వహణకు ప్రభుత్వం సరైన మద్దతు ఇవ్వకపోవడం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. అలాగే ఆలయ అదాయాల నుంచి కామన్ గుడ్ ఫండ్, అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ ప్రభుత్వం తీసుకుంటుంది.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది...

• దేవాలయ భూములపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి, ప్రైవేట్ సర్వే నంబర్లలో కలిసిపోయిన భూములపై నిష్పక్షపాత ధర్యాప్తు చేయాలి.
• దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసే నిర్ణయాలను వెంటనే నిలిపివేయాలి.
• GO No. 139 ను పూర్తిగా రద్దు చేయాలి.

• 33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల విధానాన్ని ఉపసంహరించాలి.

• ఆలయ భూముల ఆక్రమణలను రెగ్యులరైజ్ చేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి.

• అక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని భూములను తిరిగి ఆలయాలకు అప్పగించాలి.

• దేవాలయాల ఆదాయం పూర్తిగా అదే ఆలయాల అభివృద్ధికి వినియోగించే విధంగా చట్టపరమైన హామీ ఇవ్వాలి.

• ఆలయాల పండుగల నిర్వహణకు ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించాలి.

• CGF నిధులతో శిధిలావస్థ ఆలయాలు పునఃరిద్దరించాలి.

• అభివృద్ధి పేరుతో ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న భూమికి తగిన భూమి లేదా నష్టపరిహారం ఆయా ఆలయాలకు ఇవ్వాలి.

ఇది కేవలం వినతిపత్రం కాదు హిందూ సమాజం యొక్క గళం. దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఆలయ హక్కుల రక్షణ కోసం ఉద్యమం చేయడం తప్ప మాకు మరే మార్గం ఉండదు. హిందూ ఆలయ భూములు కాపాడాలి అవి ఆలయాలకే చెందాలి అని అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కోరుచున్నది.


పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాలు

పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణం లో వివరణ దొరుకుతుంది. రామ రావణ యుద్దము నందు, రావణుడు మహీరావణుడి సాయం కోరుతాడు, పాతాళానికి అధిపతి మహీరావణుడు.ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల సయనమందిరము ( తోకతో ఏర్పాటు చేసినది) నుండి రామ లక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. అది తెలుసుకొన్న ఆంజనేయుడు శ్రీ రామ లక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్తాడు.పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపలను ఒకేసారి విచ్చిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకొన్న పవనుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు. అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగ, గరుడ, వరాహ, హయగ్రీవ, నరసింహాదులు కలసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్చినం చేసి (ఆర్పి) శ్రీరామ లక్ష్మణులను కాపాడుకొంటాడు.పంచముఖాలు ఐదు దిక్కులు వాటి వివరాలు !
హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు, హనుమంతుడు భక్తసులభుడు, హనుమంతుడి కరుణాకటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు అని వేదపండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఆంజనేయస్వామి నవ అవతారాలలో దర్శనం ఇస్తాడు.ఆంజనేయస్వామి నవావతరాలు ప్రసన్నాంజనేయస్వామి, వీరాంజనేయస్వామి, వింశతి భుజ ఆంజనేయస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, అష్టాదశ భుజ ఆంజనేయస్వామి, సువర్చల ఆంజనేయస్వామి, చతుర్భుజ ఆంజనేయస్వామి, ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి మరియు వానరాకార ఆంజనేయస్వామి.ఆంజనేయస్వామి నవావతారాలలో పంచముఖ ఆంజనేయస్వామి శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించాడు. పంచముఖాలు ఐదు దిక్కులను దృష్టిని సారించి ఉండగా ఆ ముఖాలలోని వివరాలు ఈ విధంగా చెప్పబడ్డాయి.

తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు. ఆంజనేయ స్వామి, తూర్పునకు అభిముఖుడై, బాధలు కష్టాలనుండి రక్షించేవాడు

దక్షిణముఖంగా
దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.నరసింహ, దక్షిణాభిముఖుడు, దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు.

పడమర ముఖంగా
పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు. గరుడు, పడమటి దిక్కు వైపు ఆసీనుడై, ఆయుర్దాయ కాలాన్ని పెంపొందించేవాడు

ఉత్తరముఖముగా
ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.వరాహ, ఉత్తరాభిముఖుడు, మంచి జీవితాన్ని ప్రసాదించువాడు

ఊర్ధ్వంగా
ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.

శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి
ఇక.. శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి.

"శ్రీరామజయం" అనే మంత్రాన్ని 108 సార్లు
అలాగే ఆంజనేయ స్వామికి 'శ్రీరామజయం' అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.



 

*టీడ్కో హోసింగ్ సముదయం లొ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న  మాజీ మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు సభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు  గారు...*

*శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని 52 ఎకరాలు టిడ్కో గృహ సముదాయంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు  గారు ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.*

కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరైన *పత్తిపాటి పుల్లారావు గారికి కమిటీ సభ్యులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు, నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు, వరికూటి నాగేశ్వరరావు గారు, దడబడ పుల్లయ్య గారు, సింగరేసు పోలయ్య గారు* *వంకాయలపాటి వంశిధర్ గారు* *ఇట్టే శివ నాగేశ్వరావు గారు* *బండారు నరేష్ గారు* *గ్రంధి సుబ్బారావు గారు* తదితరులు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో వారివెంట *తెలుగుదేశం సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా గారు మాజీ మున్సిపల్ చైర్మన్ షైక్ రాఫాని గారు పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి మున్సిపల్ కౌన్సిలర్ జనసేన నాయకులు బిజెపి నాయకులు తెలుగుదేశం నాయకులు మునిసిపల్ కమీషనర్ శ్రీహరి గారు కాపు నాయకులు అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్రమాండాలి సభ్యులు పురుషోత్తమ్మపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్ఎస్ఎస్ కమిటీ సభ్యులు విశ్వహిందూ పరిషత్తు సభ్యులు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం గారు తదితరులున్నారు*



 

*శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...*

*శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని 52 ఎకరాలు టిడ్కో గృహ సముదాయంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.*

కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరైన *మర్రి రాజశేఖర్ గారికి కమిటీ సభ్యులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు, నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు, వరికూటి నాగేశ్వరరావు గారు, దడబడ పుల్లయ్య గారు, సింగరేసు పోలయ్య గారు* *వంకాయలపాటి వంశిధర్ గారు* తదితరులు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో వారివెంట *నిడమానూరు హనుమంతరావు గారు, నరేంద్ర రెడ్డి గారు, విజయ్ గారు* తదితరులున్నారు.




 

52 ఎకరాల టిడ్కో హౌసింగ్ కాలనీలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు – సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి* ఆధ్వర్యం


చిలకలూరిపేట:

*లోకకళ్యాణం కోసం, ధర్మ సంస్థాపన కోసం అవతరించిన మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుని జన్మదినమైన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, చిలకలూరిపేట పరిధిలోని 52 ఎకరాల టిడ్కో (TIDCO) గృహ సముదాయంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించ తలపెట్టాము.*

*ఈ సందర్భంగా చిలకలూరిపేట కూటమి నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ, టిడ్కో నివాసితులందరి సమక్షంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడుతాయని తెలిపారు*

*కార్యక్రమ వివరాలు*

* *వేదిక: 52 ఎకరాల టిడ్కో హౌసింగ్ కాలనీ ప్రాంగణం*

* *ముఖ్య కార్యక్రమాలు: శ్రీ సీతారాముల వారి పూజ, భజన కీర్తనలు మరియు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ*

* *పాల్గొనేవారు: కూటమి ప్రభుత్వం ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు టిడ్కో కాలనీ నివాసితులు*

ముఖ్య ఉద్దేశ్యం:

*రామరాజ్య స్థాపనే లక్ష్యంగా, ప్రజలందరిలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడానికి మరియు టిడ్కో లబ్ధిదారులందరిలో ఐక్యతను చాటడానికి ఈ వేడుకలను నిర్వహిస్తున్నాము. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా టిడ్కో కాలనీ నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామచంద్రుని కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము*

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి ప్రభుత్వం*
*చిలకలూరిపేట నియోజకవర్గం*





ఈ చిత్రం 2026లో శ్రీరామ నవమి పండుగను జరుపుకునే తేదీ గురించి వివరిస్తుంది.

శ్రీరామ నవమిని సాధారణంగా చైత్ర మాసం శుక్లపక్ష నవమి నాడు జరుపుకుంటారు.

2026లో నవమి తిథి మార్చి 26 మధ్యాహ్నం 2:18 గంటలకు ప్రారంభమై, మార్చి 27 మధ్యాహ్నం 12:36 గంటల వరకు ఉంటుంది.

సూర్యోదయ సమయంలో నవమి తిథి ఉన్నందున, పండితుల అభిప్రాయం ప్రకారం మార్చి 27 (శుక్రవారం) నాడు పండుగ జరుపుకోవాలి.

భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా మార్చి 27న జరగనుంది••


అదంతా ఫేక్! ఆ వీడియోపై గరికపాటి నరసింహారావు క్లారిటీ


_Garikapati Narasimharao: తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు స్పష్టతనిచ్చారు. రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో గరికపాటి నరసింహరావు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శ చేసినట్లు వస్తున్న వీడియో విక్రీకరించినదని ఆయన టీం స్పష్టం చేసింది._


_రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శ చేసినట్లు వస్తున్న వీడియో వక్రీకరించినదని ఆయన టీం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ సభలలో గరికపాటి నరసింహరావు అలా మాట్లాడలేదని వెల్లడించింది. ‘వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో గురువుగారు మాట్లాడిన మాటలను కలగలిపి ఈ వీడియోకి జత చేసి వ్యతిరేక అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారు. గురువుగారు ఎప్పుడూ పేదల పక్షమే. వారి ప్రసంగాలలో తరచుగా ధనవంతులు ఔదార్యం చూపించి పేదలను ఆదుకోవాలని, సంక్షేమ గురుకులాలలో, పాఠశాలలో పిల్లలకు పాలను, పౌష్టిక పదార్థాలను, దుప్పట్లను, వస్త్రాలను దానం చేయడానికి దాతలు ముందుకు రావాలని కొన్ని వందల సార్లు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు.’ అని గరికపాటి టీం ఆ ప్రకటనలో వెల్లడించింది._


_అంతేగాక, ‘శ్రావణ మాసం నోములలో భాగంగా చీరలను బంధువులకు కాకుండా దళితవాడలలో ఉన్న స్త్రీలకు పంచి పెట్టాలని ఎన్నోసార్లు వారు(గరికపాటి) పిలుపునిచ్చారు. భగవంతుడు ఎప్పుడూ పేదవాళ్ల పార్టీనే అని గర్వంగా వేదికలపై ఎన్నోసార్లు ప్రకటించారు. గురువుగారి ప్రసంగాల ప్రభావంతో పేదలందరూ హిందూ ధర్మ స్ఫూర్తితో ఉండటం చూసి జీర్ణించుకోలేక వారిని పేదల నుంచి దూరం చేయడానికి కొంత మంది మూర్ఖులు వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. కావున, ఇటువంటి కుతంత్రాలకు ఎవ్వరూ లొంగవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూ బంధువులంతా సమైక్యంగా, సర్వకుల సామరస్యంతో జీవించాలన్నదే గురువుగారి ఆకాంక్ష’ అని గరికపాటి నరసింహారావు బృందం వారి ప్రకటనలో స్పష్టం చేసింది._




మేల్కో హిందువా! ఇదేనా సమానత్వం?

ప్రభుత్వాల మతపరమైన పక్షపాతంపై నిలదీద్దాం! ఒకవైపు హిందూ ఆలయాల నిధులు ప్రభుత్వ పరమవుతుంటే, మరోవైపు భారీగా నిధుల మళ్లింపు జరుగుతోంది.

*వాస్తవాలు ఇవే:*

₹6,090 కోట్లు: ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయింపు.

₹45 కోట్లు: ఇమామ్‌లు, మౌజామ్‌ల పెండింగ్ జీతాల విడుదల.

హజ్ యాత్ర: యాత్రికులకు భారీగా ఆర్థిక సాయం.

ఉర్దూ ఘర్‌లు & షాదీ ఖానాలు: కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు.

*మన ప్రశ్నలు:*

ధూప దీప నైవేద్యాలకు నోచుకోని వేల ఆలయాల సంగతేంటి?

మన అర్చకుల దీన స్థితికి బాధ్యులెవరు?

హిందూ భక్తుల కానుకలను హిందూ ధర్మ ప్రచారానికే ఎందుకు వాడకూడదు?

ఇది ప్రజాస్వామ్యమా లేక మతపరమైన తుష్టీకరణా?

లౌకికవాదం పేరుతో జరుగుతున్న ఈ అన్యాయాన్ని ప్రశ్నిద్దాం!


చల్లని జీవితం కోసం గురుమంత్రాలు

*ముందుమాట:* 
 
*మన జీవితంలో సరదాగా చెప్పుకునే చిన్న చిన్న మాటలు కూడా మనలో పెద్ద మార్పులు తీసుకురాగలవు, ఇవి నవ్వు తెప్పించడమే కాకుండా జీవితం గురించి లోతుగా ఆలోచించేటట్లు చేస్తాయి, అందుకే ఈ గురుమంత్రాలను హాస్యంగా తీసుకుంటూ వాటి వెనుక ఉన్న అర్థాన్ని కూడా గ్రహించడం మంచిది.*

*1. డబ్బు అంతా కాదు (Money is not everything)* 
*డబ్బు జీవితంలో చాలా ముఖ్యమైనదే అయినా అది ఒక్కటే అన్నీ కాదు, మనుషుల ప్రేమ, ఆరోగ్యం, ఆనందం కూడా అంతే అవసరం అని గుర్తుంచుకుంటే జీవితం సమతుల్యంగా ఉంటుంది.*

*2. జంతువులను ప్రేమించండి (Love Animals)* 
*జంతువులను ప్రేమించడం అంటే ప్రకృతిని ప్రేమించడం లాంటిదే, వాటిని గౌరవించడం ద్వారా మనలో దయ, కరుణ వంటి మంచి లక్షణాలు పెరుగుతాయి.*

*3. నీటిని సేవ్ చేయండి (Save Water)* 
*నీరు లేకుండా జీవితం అసంభవం కాబట్టి ప్రతి చుక్కను ఆదా చేయడం మన బాధ్యత, వృథా చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించడం భవిష్యత్తుకు మేలు చేస్తుంది.*

*4. ఆరోగ్యకరమైన ఆహారం (Healthy Food)* 
*పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరం బలంగా ఉండి రోగాలకు దూరంగా ఉండగలుగుతుంది.*

*5. పుస్తకాల విలువ (Value of Books)* 
*పుస్తకాలు మనకు జ్ఞానాన్ని అందించే గొప్ప మిత్రులు కాబట్టి వాటిని చదవడం ద్వారా మన ఆలోచనా విధానం మెరుగుపడుతుంది.*

*6. కార్యాలయంలో ప్రవర్తన (Office Behavior)* 
*ఆఫీసులో శాంతంగా, క్రమశిక్షణతో పని చేయడం వల్ల మనకు మంచి పేరు వస్తుంది మరియు సహచరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి.*

*7. పొరుగువారితో సంబంధం (Neighbors)* 
*పొరుగువారితో మంచి సంబంధాలు కలిగి ఉండటం వల్ల అవసరమైనప్పుడు సహాయం పొందగలుగుతాము, కానీ వ్యక్తిగత పరిమితులను కూడా గౌరవించడం అవసరం.*

*8. కష్టపడి పని (Hard Work)* 
*కష్టపడితే విజయం తప్పకుండా వస్తుంది కానీ తెలివిగా పనిచేస్తే మరింత త్వరగా ఫలితాలు పొందవచ్చు అని గుర్తుంచుకోవాలి.*

*9. ఆలస్యం అలవాటు (Procrastination)* 
*పనులను వాయిదా వేయడం అలవాటు అయితే అది మన అభివృద్ధికి అడ్డంకిగా మారుతుంది కాబట్టి సమయానికి పూర్తి చేయడం చాలా ముఖ్యం.*

*10. వివాహం గురించి (Marriage Life)* 
*వివాహం అనేది ఆనందం, బాధ్యత, సహనం, అర్థం చేసుకోవడం అన్నింటి మేళవింపు కాబట్టి దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.*

*11. నవ్వు శక్తి (Power of Smile)* 
*నవ్వు మనసుకు ఓ ఔషధం లాంటిది, అది మన ఒత్తిడిని తగ్గించి మన చుట్టూ ఉన్నవారికి కూడా ఆనందాన్ని పంచుతుంది.*

*12. స్నేహితుల విలువ (Friends Value)* 
*మంచి స్నేహితులు జీవితంలో ఆనందాన్ని రెట్టింపు చేస్తారు మరియు కష్టకాలంలో మనకు బలంగా నిలుస్తారు.*

*13. ఆరోగ్య జాగ్రత్తలు (Health Care)* 
*ఆరోగ్యం ఉన్నప్పుడు దాని విలువ తెలియదు కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అవసరం.*

*14. సమయం విలువ (Value of Time)* 
*సమయం ఒకసారి పోయిన తర్వాత తిరిగి రాదు కాబట్టి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం మన విజయానికి కీలకం.*

*15. జీవితం ఆనందంగా (Happy Life)* 
*జీవితం చిన్నదే కాబట్టి ప్రతి రోజును ఆనందంగా గడపడం, చిన్న విషయాల్లో సంతోషం కనుగొనడం నిజమైన సంతోషానికి దారి తీస్తుంది.*

*ముగింపు:* 
*ఈ గురుమంత్రాలు సరదాగా కనిపించినా అవి మనకు జీవితం గురించి విలువైన పాఠాలు నేర్పుతాయి, నవ్వుతూ జీవించడం నేర్చుకుంటే మన జీవితం నిజంగా చల్లగా, సంతోషంగా మారుతుంది.*






జనావాసాలు కాంక్రీటు అడవులుగా మారి కర్బన ఉద్గారాలను పెంచుతున్న ఈ రోజుల్లో..

బీహార్లోని గయాకు చెందిన బ్రజేంద్రకుమార్ చౌబే అనే గ్రామీణుడు ఆధునిక శైలికి విరుద్ధంగా, పర్యావరణహితంగా ఇంటిని నిర్మించారు. సిమెంటు, నీరు ఎక్కడా వాడకుండా.. ఇటుకల మధ్య ఆవుమూత్రం, పేడతోపాటు ప్రాచీన భారత సంప్రదాయాల్లో పేర్కొన్న ఔషధ మూలికలతో మేళవించిన మిశ్రమం ఉపయోగించి గృహనిర్మాణం పూర్తి చేశారు. దాదాపు 2 వేల చదరపు అడుగుల జాగాలో కట్టిన ఈ ఇంటికి నీటికి బదులుగా ఆవుమూత్రం.. సిమెంటుకు ప్రత్యామ్నాయంగా వేప, నిమ్మ, పసుపు, ఆమ్లా, నల్లతుమ్మ బంక తదితర సహజ పదార్థాలతో తయారుచేసిన జిగురును వాడారు. ఇదే జిగురుతో గోడలకు పూత పని కూడా చేశారు. రూ.5

లక్షల ఖర్చుతో నెలన్నర రోజుల్లో ఈ నిర్మాణం పూర్తయింది.

250 గిర్ జాతి ఆవులను పెంచుతున్న చౌబే తన గురువుతోపాటు పంచగవ్యాల (ఆవు నుంచి వచ్చే 5 రకాల ఉత్పత్తులు) స్ఫూర్తితో నిర్మించిన ఈ ఇల్లు ఆవును ‘నడిచే వైద్యాలయం'గా భావించిన మన మూలాల్లోకి వెళ్లే ఓ ప్రయత్నంగా పేర్కొన్నారు. దీన్ని పంచగవ్య ఆధారిత వైద్యకేంద్రంగా మార్చే యోచన ఉందన్నారు. సహజ ఉత్పత్తులతో కట్టిన ఈ విధమైన ఇళ్లు చల్లగా.. చెదలు పట్టకుండా ఉంటాయని గయా మున్సిపల్ కార్పొరేషను ఇంజినీరు సుభోద్కుమార్ సింగ్ అభిప్రాయపడ్డారు.




సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ  కార్యదర్శిగా నియమితులైన సింగరేసు పోలయ్య


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన జాతీయ  కార్యదర్శిగా నియమితులైన సింగరేసు పోలయ్య . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా సింగరేసు పోలయ్య తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన సింగరేసు పోలయ్య.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన సింగరేసు పోలయ్య.

అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన సింగరేసు పోలయ్య.

సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన జాతీయ  కార్యదర్శి సింగరేసు పోలయ్య .
హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి సింగరేణి పోలయ్య అన్నారు.


అమలాపురం వెంకన్న సాక్షిగా.. ప్రసాదానికి 'గ్యాస్' సెగ...

​ప్రతి ఏటా ఉగాది పర్వదినాన నోరూరించే తీపి ప్రసాదంతో భక్తులను ముంచెత్తే అమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈసారి ఒక 'వింత' జరిగింది. వస్తువులన్నీ ఉన్నాయి.. దాతలు సిద్ధంగా ఉన్నారు.. కానీ ప్రసాదం మాత్రం పక్కన పెట్టేశారు.

​ఎందుకంటే..

"గ్యాస్ సిలిండర్ దొరకలేదు" అని దేవస్థానం వర్గాలు సింపుల్‌గా కారణం చెప్పేశాయి..

​ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కోనసీమలోని మిగతా ప్రధాన ఆలయాలన్నింటిలోనూ ప్రసాదాల వితరణ బ్రహ్మాండంగా జరుగుతోంది.. అక్కడ లేని 'గ్యాస్ కొరత' ఒక్క అమలాపురం వెంకన్న వంటగదిలోనే ఎందుకు వచ్చింది?

​రాష్ట్రంలో సరఫరా అద్భుతంగా ఉందని అధికారులు చెపుతుంటే, దేవుడి దగ్గరే సిలిండర్ మాయమవ్వడం విశేషం.

ఇది నిజంగానే ‘గ్యాస్ కొరతా’ లేక బాధ్యతను గాలికొదిలేసిన ‘నిర్వహణ కొరతా’?


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు




సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వరికూటి నాగేశ్వరరావు


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వరికూటి నాగేశ్వరావు. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా వరి కోటి నాగేశ్వరరావు తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన వారికూటి నాగేశ్వరరావు.

సనాతన హిందూ ధర్మ పరీక్షణా సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన వరికూటి నాగేశ్వరరావు.

అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ వారి అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన వరికూటి నాగేశ్వరరావు.

సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి వరికూటి నాగేశ్వరరావు.





పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సనాతన హిందూ సాంప్రదాయ పండుగలకు ప్రభుత్వ నిధులు కేటాయించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సనాతన హిందూ సాంప్రదాయ పండుగలకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా బీజేపీ యువ నాయకులు ఇంగ్గుటూరి రాజశేఖర్ రెడ్డి సంఘ రాష్ట్ర కార్యదర్శి సింగరేసు పోలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*

*వినతి పత్రం స్వీకరించిన డిఆర్ఓ గారు వెంటనే దేవాదాయ శాఖ వారిని పిలిచి ఈ సమస్యపై స్పందించి నిధులు కేటాయించాలని కోరారు*

*పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి సమర్పించిన వినతి పత్రం*

*విషయం: వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి – ఉగాది కొనుగోలు మార్కెట్లలో ప్రజలకు తగిన సదుపాయాలు కల్పించాలి – సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి వినతి*

*ఇటీవల సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులకు  ప్రజలు, ఆలయ కమిటీలు, ధర్మదాతలు మరియు భక్తుల నుండి ముఖ్యమైన వినతులు అందాయి. త్వరలో ప్రారంభం కానున్న వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి పర్వదినాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ సహకారం అవసరమని వారు కోరారు*

*భారతీయ సంస్కృతిలో వసంత ఋతువు అత్యంత పవిత్రమైన మరియు ఆధ్యాత్మికమైన కాలంగా భావించబడుతుంది. ఉగాది నుండి ప్రారంభమయ్యే వసంత నవరాత్రులు మరియు అనంతరం జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలు భక్తులకు అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పర్వదినాలు. ఈ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు, హోమాలు, సీతారామ కల్యాణాలు, భజనలు, హరికథలు వంటి కార్యక్రమాలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతాయి*

*అదే సమయంలో వసంత నవరాత్రులు అమ్మవారికి కూడా అత్యంత ప్రియమైన పర్వదినాలుగా భావించబడుతాయి. అందువల్ల గ్రామాలలో ఉన్న అమ్మవారి ఆలయాలు మరియు గ్రామ దేవతల ఆలయాల్లో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయం*

*ఈ ఉత్సవాలు ప్రజల్లో భక్తి, ఐక్యత, సంస్కృతి మరియు సంప్రదాయాల పరిరక్షణకు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి*

*అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక గ్రామాలు మరియు పట్టణాల్లో ఉన్న రామాలయాలు, అమ్మవారి ఆలయాలు మరియు గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల ఆలయ కమిటీలు మరియు భక్తులు ఇబ్బందులు పడుతున్నారని జనతా వారధి పర్యటనలో వెల్లడైంది*

*కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని ఆలయాల్లో వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము*

ఈ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ముఖ్యమైన ఏర్పాట్లు:
• ఆలయ ప్రాంగణాల శుభ్రపరిచే పనులు
• విద్యుత్ దీపాలంకరణలు మరియు ఆలయాల అలంకరణ
• వసంత నవరాత్రుల ప్రత్యేక పూజలు మరియు హోమాల నిర్వహణ
• శ్రీ సీతారామ కల్యాణం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు
• భక్తులకు ప్రసాదం మరియు అన్నదానం కార్యక్రమాలు
• హరికథలు, భజనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు
• భక్తులకు తాగునీరు మరియు ఇతర మౌలిక సదుపాయాలు
• భక్తులకు కూర్చునే సదుపాయాలు మరియు తాత్కాలిక పందిళ్లు
• భక్తుల భద్రత కోసం తగిన ఏర్పాట్లు
• ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత నిర్వహణ

*అలాగే ఉగాది సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉగాది పచ్చడి కోసం అవసరమైన పదార్థాలు, పండ్లు, పూలు మరియు ఇతర వస్తువులను కొనుగోలు చేసే మార్కెట్ ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది*

అందుకోసం:
• మార్కెట్ ప్రాంతాల్లో శుభ్రత నిర్వహణ
• తాగునీటి సదుపాయం
• ట్రాఫిక్ నియంత్రణ
• తాత్కాలిక షెడ్లు మరియు ప్రజలకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు
• భద్రత మరియు ప్రజా సౌకర్యాల ఏర్పాటు

ఇలాంటి ఏర్పాట్లు ప్రభుత్వ సహకారంతో జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించబడటమే కాకుండా భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుంది.
-కాబట్టి రాష్ట్రంలోని అన్ని రామాలయాలు, అమ్మవారి ఆలయాలు మరియు గ్రామ దేవతల దేవాలయాల్లో వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని గౌరవనీయ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారిని వినమ్రంగా కోరుతున్నాము


*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి*
*ఆంధ్రప్రదేశ్*



 

ఒంటిమిట్ట కోదండ రామాలయ పుష్కరిణి దగ్గర దర్గా.. ఆక్రమణ కాదా?

ఒంటిమిట్ట కోదండ రామాలయ పవిత్రతను కాపాడుకుందాం!
​ఆంధ్రప్రదేశ్ భద్రాచలంగా వెలుగొందుతున్న ఏకశిలా నగరం ఒంటిమిట్ట. స్వామివారికి అత్యంత పవిత్రంగా తెప్పోత్సవం నిర్వహించే చెరువు నీటిని ఆనుకొని ఒక దర్గా వెలవడం ఎంతవరకు సమంజసం? మన ధర్మం మరియు సంప్రదాయాల ప్రకారం అత్యంత ప్రాశస్త్యం ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాలు రావడం వెనుక ఆంతర్యం ఏమిటి?

​నేను అడిగే ప్రశ్నలు ఇవే:
​ఇస్లాం సిద్ధాంతాలకు ఇది విరుద్ధం కాదా? - నిజమైన ముస్లింలు ఖురాన్ మీద ఒట్టేసి చెప్పగలరా? అల్లాహ్ మరియు మహమ్మద్ ప్రవక్తను తప్ప వేరే ఎవరినీ పూజించకూడదని, సమాధులకు మొక్కకూడదని మీ మతం చెబుతోంది కదా! మరి ఈ దర్గాల సంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది?

​ఆక్రమణలు ధర్మం అనిపించుకుంటాయా? - అల్లాహ్ చెప్పిన మాట వినకుండా, ఇలాంటి దర్గాల పేరుతో ఆక్రమణలు చేస్తూ సాక్షాత్తూ మీ దేవుడినే అవమానిస్తున్నది ఎవరు?

​సమానత్వం అంటే ఇదేనా? - రేపు పొద్దున మక్కా మసీదు పక్కన వేరే దేవాలయం కడితే అంగీకరిస్తారా? అక్కడ లేని నియమం ఇక్కడ ఒంటిమిట్ట రామాలయ చెరువు దగ్గర ఎందుకు వర్తించదు?

​నా ఉద్దేశ్యం ఒక్కటే:
నాకు వ్యక్తుల మీద ద్వేషం లేదు. ఇస్లాం సిద్ధాంతాలను నూటికి నూరు శాతం పాటించే వ్యక్తులంటే నాకు గౌరవం ఉంది. కానీ, మతం పేరు చెప్పుకొని ఇలాంటి ఆక్రమణలకు పాల్పడే వారి వైఖరి పట్లే నా అభ్యంతరం.
​మనం ఇప్పుడు మౌనంగా ఉంటే, రేపు పొద్దున "ఇది ఎప్పటి నుండో ఇక్కడే ఉంది.. దీన్ని తీయకూడదు" అని పంచాయతీలు మొదలవుతాయి. అందరూ ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే అని మనం సర్దుకుపోతుంటే, మన పుణ్యక్షేత్రాల పవిత్రత కనుమరుగైపోయే ప్రమాదం ఉంది.

​నిజమైన ముస్లింలు ఈ విషయంలో ఆలోచించాలి. మన ధర్మాన్ని, మన ఆలయాల ప్రాశస్త్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత!




 

సనాతన ధర్మం కథలు..కర్మ సిద్ధాంతం


తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుస్తుంది. అలాగే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. అది మనల్ని శిక్షకు గురిచేస్తుంది. ఎవరు చేసే పాపపుణ్యాల ఫలితం వారే అనుభవించక తప్పదు. పాపం లేదు, పుణ్యం లేదు, మనం బతకడం ముఖ్యం, అందుకు ఏమైనా చేస్తాం... అనే వారివల్ల సమాజానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. పాపభీతి, పుణ్యకార్యాల స్పృహ లేని సమాజం చాలా వేగంగా పతనం వైపు పయనిస్తుంది.

కొంతమంది నగలు దొంగిలించి పారిపోతూ మాండవ్య ముని తపస్సు చేస్తున్న చోట దాక్కున్నారు. రాజభటులు దొంగలను వెతుకుతూ ఆ ప్రదేశానికి వచ్చి వారిని పట్టుకున్నారు. మాండవ్య మునిని కూడా బంధించి రాజసభలో ప్రవేశపెట్టారు. రాజు వారికి శూలదండన విధించాడు. గుచ్చిన శూలం పైన ఉండి కూడా మాండవ్యుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. ‘ఏం తప్పు చేశావు, ఈ శిక్ష అనుభవిస్తున్నావు?’ అని కొందరు తాపసులు అడగగా ఇందులో ఎవరి దోషం లేదని ‘దోషతః కం గమిష్యామి న హి మే అన్యో అపరాధ్యతి’ అని చెప్పాడు. రాజు ఆయన ధర్మదీక్షను గుర్తించి క్షమాపణ కోరాడు.           మాండవ్యుడు ధర్మదేవుడి దగ్గరికి వెళ్లి ‘నేను ఏం తప్పు చేశానని నాకీ శిక్ష వేశావు’ అని అడిగాడు. ‘నువ్వు చిన్నప్పుడు మిడతలు పట్టుకుని వాటి తోకల వెనక ఇషీక అనే వాడియైన గడ్డిని దూర్చి బాధ పెట్టావు. అందుకే నీకీ శిక్ష. చిన్న దానం చేసినా వందరెట్లు ఫలితం వస్తుంది. అలాగే చిన్న దోషం చేసినా వందరెట్లు శిక్ష అనుభవించాల్సి వస్తుంది’ అని ధర్మదేవుడు చెప్పాడు. ‘పద్నాలుగు సంవత్సరాల వరకు పిల్లలు ఏ తప్పు చేసినా అది తెలియక చేసిన దోషమే అవుతుంది. ఈ ధర్మసూక్ష్మం తెలుసుకోకుండా నన్ను శిక్షించావు కాబట్టి నువ్వు మానవలోకంలో జన్మించు’ అని మాండవ్యుడు ధర్మదేవుణ్ని శపించాడు. దాని ఫలితమే ఆయన విదురుడిగా జన్మించాల్సి వచ్చింది. తెలిసి చేసినా తెలియక చేసినా కర్మల దోషాల ఫలితం అనుభవించక తప్పదని భారతంలోని ఈ కథ చాటి చెబుతుంది.

పాప పుణ్యాలు, స్వర్గ నరకాలు మన నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. కానీ ఏవి మంచి పనులు, ఏవి చెడ్డ పనులు అన్నది మన అంతరాత్మకు తెలుసు. మనం చేసే కర్మల ఫలితం ఈ లోకంలో మనం జీవించి ఉండగానే అనుభవించడం తథ్యమని తెలుసుకోవాలి. సమాజ హితం కోరే మంచి పనులు చేయాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మానసిక పరిణతి కూడా పెరగాలి. అరిషడ్వర్గాలపై నియంత్రణ సాధించాలి. దాన్ని ఎంత చిన్న వయసులో సాధిస్తే అంతగా మానసిక ప్రశాంతత, అంతరంగ నిర్మలత్వం అలవడతాయి. అవి చేకూరినప్పుడు కర్మ ఫలితాన్ని కూడా ఆనందంగా అనుభవిస్తాం.






సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి విధి విధానాలు

1. హిందూ దేవాలయాల ఆస్తులు భూములు పరిరక్షించడం

2. గోవులను సంరక్షించడం

3. గోశాలల నిర్మాణం

4. హిందూ సమ్మేళనం ఏర్పాటు

5. పురాతన హిందూ దేవాలయాల పునర్  నిర్మాణం

6. గో ఆధారిత పరిశ్రమల ఏర్పాటు

7. ప్రకృతి వ్యసాయం ను అభివృద్ధి చేయుట

8. ప్రకృతిని కాపాడటానికి అవసరం అయినా చెర్యలు తీసుకోవడం

9. ప్రతి గ్రామం లో సంస్థ తరుపున కమిటీలు ఏర్పాటు

10. మండల స్థాయిలో సంస్థ కమిటీలు ఏర్పాటు

11. జిల్లా స్థాయిలో సంస్థ కమిటీలు ఏర్పాటు

12. రాష్ట్ర స్థాయిలో సంస్థ కమిటీలు ఏర్పాటు

13. జాతీయ స్థాయిలో సంస్థ కమిటీలు ఏర్పాటు

14. ఇతర హిందూ ధార్మిక సంస్థలతో కలిసి పనిచేయడం

15. సంస్థ ను విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం

16. స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించడం

17. హిందూ పండుగలను ప్రచారం చేయడం

18. యోగ సెంటర్స్ ఏర్పాటు

19. సమాజ సేవ లో పనిచేస్తున్న వారిని సత్కరించడం

20. ప్రకృతి వ్యసాయం చేస్తున్న రైతు కుటుంబాలను గౌరవించడం

21. హిందూ సమాజం అభివృద్ధికి కృషి చేసిన వారిని గౌరవించడం



కోటప్పకొండ ప్రసాదం పై మీడియాలో వస్తున్న కథనాలపై ఈవో చంద్రశేఖర్ వివరణ

Kotappakonda Trikoteswara Swamy Temple దేవస్థానంలో ప్రసాదం నాణ్యతపై మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు పూర్తిగా అవాస్తవమని దేవస్థానం ఈవో చంద్రశేఖర్ తెలిపారు. భక్తులకు అందిస్తున్న ప్రసాదం శుభ్రత, నాణ్యత ప్రమాణాలను పూర్తిగా పాటిస్తూ తయారు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
దేవస్థానంలో తయారు చేసే ప్రసాదానికి అవసరమైన పదార్థాలు అన్నీ మంచి నాణ్యతతోనే కొనుగోలు చేసి, పరిశుభ్రమైన వాతావరణంలో తయారీ ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా పర్యవేక్షణ కూడా చేస్తున్నామని చెప్పారు.
కొన్ని సోషల్ మీడియా వేదికల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను భక్తులు నమ్మవద్దని, దేవస్థానం పరిపాలన ఎప్పటికప్పుడు ప్రసాదం తయారీపై తనిఖీలు నిర్వహిస్తోందని ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు.
దేవస్థానం పరిపాలన భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని, ఎవరైనా అనుమానాలు ఉంటే నేరుగా దేవస్థానం అధికారులను సంప్రదించాలని సూచించారు.




పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లొ ఫిర్యాదు చేసిన సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు

*జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పశువుల అక్రమ రవాణాపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు చిలకలూరిపేట నేషనల్ హైవే లో జరుగుతున్న పశువుల అక్రమ రవాణాపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా కలెక్టర్ గారు స్పందించి తగు చర్యలు తీసుకుంటామని పరిరక్షణ సమితి సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది*

*ఈ కార్యక్రమంలో ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి వరికూటి నాగేశ్వరరావు జాతీయ ఉపాధ్యక్షులు వంకాయలపాటి వంశీధర్ అలాగే పల్నాడు జిల్లా బిజెపి నాయకులు అందరూ ఫిర్యాదు ఇచ్చిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*