Articles by "ఫిర్యాదులు -పరిష్కారం"
Showing posts with label ఫిర్యాదులు -పరిష్కారం. Show all posts






పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పణ

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లెల శివ నాగేశ్వరరావు, నరసరావుపేట బీజేపీ నాయకులు శ్రీ సంపత్ కుమార్, హిందూ ధార్మిక సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
వినతిలో ప్రధాన డిమాండ్లు:
🔸 రాష్ట్రంలోని ఆలయాలను సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి.

🔸 TTDతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సాంప్రదాయ కళాకారుల ఎంపికకు పారదర్శక విధానం అమలు చేయాలి.

🔸 భజన బృందాలు, కోలాటం, హరికథ, జానపద కళలు, కూచిపూడి, భరతనాట్యం తదితర సంప్రదాయ కళలకు ప్రోత్సాహం కల్పించాలి.

🔸 జిల్లా వారీగా కళాకారుల నమోదు, డిజిటల్ డేటాబేస్, సమాన అవకాశాలు మరియు పారదర్శక ఎంపిక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
సనాతన ధర్మం – భారతీయ సంస్కృతి – సంప్రదాయ కళల పరిరక్షణే మా లక్ష్యం.
మల్లెల శివ నాగేశ్వరరావు

జాతీయ అధ్యక్షుడు

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి


 

 

*హిందూ దేవదాయ చట్టం  30/ 1987*

హిందూమతంపై ప్రత్యక్షంగా,పరోక్షంగా గాని దాడి చేయడం లేదా అసభ్యకరమైన పదజాలంతో మతమును కించపరిచే వారి నుండి  భారత రాజ్యాంగంలో  చట్టాలు చేయబడిన  నియమ నిబంధనలతో అడ్డంకులను నిరోధించడం ఎలా ??

*హిందూ దేవాదాయ చట్టము  30/1987*

హిందూ దేవాదాయ చట్టప్రకారం హిందూ దేవాలయాల చుట్టుప్రక్కల, హిందూ నివాసగృహాల మధ్య పరిసర ప్రాంతాలలో రోడ్లపై పోస్టల్ బ్యానర్లు, మైక్ సెట్ ద్వారా ప్రార్థనల వంటి అన్యమత ప్రచారం నిషేధించడమైనది. అతిక్రమించిన వారు జి. ఓ 746,747  ప్రకారం అరెస్టయితే బెయిల్ లభ్యంకాని  శిక్షలకు అర్హులవుతారు.

      30/1987 ప్రకారం దేవాలయ ఆవరణలో పాన్,సిగరేటు,ఉమ్మివేయడం వంటి ఆకృత్యాలు చేసినను హిందువులైనప్పటికీ శిక్షకు అర్హులవుతారు .మసీదు, చర్చి వంటి అన్యమత ప్రార్దన మందిరాలు నిర్మించ తలపెట్టినప్పుడు కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా పొందాలి.

ఎక్కడైనా కలెక్టరు లేదా ఆ పరిసర ప్రాంత సబ్ ఇన్స్పెక్టర్ లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్  ద్వారా అనుమతి పొందిన పత్రాలు లేకుండా వ్యక్తిగత ప్రసారం లేదా వాహనాల ద్వారా ప్రసారం చేసిన అటువంటి ప్రసారాలను అడ్డుకునే విషయములో గ్రామాధికారులు అధికారము కలిగి ఉంటారు.

      హిందూ మతాన్ని దూషించడం, అసభ్యకరంగా మాట్లాడడం చేసినయెడల ipc 295 (1), ఒకవేళ హిందూ దేవుళ్లను గురించి  మాట్లాడుతూ  ఆ సంస్కృతి పరువు  తీసిన  తీసివేయుటకు వంటి విషయములను  ముద్రించడం  లేదా  ముద్రించి  విక్రయించడం  చేసినయెడల ipc 501,502(2) క్రింద కేసును నమోదు చేయమని,
దేవుడి పేరు చెప్పి,  మతం పేరుచెప్పి  భయోత్పాతం  కలిగించుట  వంటి కార్యకలాపాలు చేపట్టిన  ఎడల  ipc 503 సెక్షన్ ప్రకారం  కేసు నమోదు చేయమని  కోరడం,
మత విశ్వాసాలను  విశ్వసించక పోతే  దేవుడు శపిస్తాడని  లేదా అనేక కార్యకలాపాల్లో  మీకు అసౌకర్యం కలుగుతుందని మిమ్మల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తే ipc 508 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని కలెక్టరు లేదా సమీప పోలీస్ స్టేషన్ అధికారులను కోరవచ్చును.

      ఈ విషయంలో అన్యమత ప్రచారం జరుగుతుందని ఫోన్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసిన వెంటనే  పోలీసు శాఖ వారు స్పందించని ఎడల ఫిర్యాదుదారులు నేరుగా కలెక్టర్ గారికి లిఖిత పూర్వక ఉత్తరాల ద్వారా సవివరాలతో సబ్ ఇన్స్పెక్టర్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ పై 219 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని న్యాయ సంబంధమైన విషయములు చట్ట విరుద్ధంగా వ్యవహరించి అందుకుగాను 217 సెక్షన్ ప్రకారం నేరస్తులను కాపాడే ప్రయత్నం చేసినందుకు గాను కేసు నమోదు చేయమని కోరవచ్చును.



*జైశ్రీరామ్ జై హింద్*


ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఒంటిమిట్ట అభివృద్ధి* *అద్భుత పర్యాటక కేంద్రంగా మారుస్తాం*  *సీఎం సమీక్షా సమావేశం వివరాలను వెల్లడించిన బీటెక్ రవి

ఒంటిమిట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒంటిమిట్ట అభివృద్ధిపై స్థానిక నేతలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఆయన చెప్పింది ఏంటంటే.. ఎప్పుడూ కూడా ఒంటిమిట్ట చెరువు నీటితో కళకళలాడాలి.

సోమశిల బ్యాక్ వాటర్ కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. దీని మీద ఏదైనా ఇరిగేషన్ ఉన్నా కూడా, ఆ తర్వాత ఇన్-ఫ్లో, అవుట్-ఫ్లో కూడా ఈక్వల్ గా పెట్టి ఎప్పుడూ చెరువు కళకళలాడుతూ ఉండాలి. నేషనల్ హైవే కొంచెం దూరంగా పోతుంది, మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది. ఆ నేషనల్ హైవే నుంచి రైల్వే ట్రాక్ మీద ఓవర్ బ్రిడ్జి కూడా ప్లాన్ చేసి ఒక టౌన్ ప్లాన్ సిద్ధం చేయాలి.

ల్యాండ్ ఏమన్నా ఉంటే చూసి టెక్స్‌టైల్ పార్క్ కానీ, హ్యాండ్‌లూమ్ పార్క్ కానీ ఇంకా ఏదైనా రెవెన్యూ జనరేట్ అయ్యేటట్టుగా ఏదైనా మంచి కంపెనీలు కూడా స్టార్ట్ చేసి.. ఇంకా కొండ మీద, ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఫారెస్ట్ వాళ్లను సంప్రదించి మంచి మంచి చెట్లు అవన్నీ నాటి ఇదొక అద్భుతమైన పర్యాటక సెంటర్ గా మారాలి. భవిష్యత్తులో ఈ ఒంటిమిట్ట అనేది ఒక అద్భుతమైన దేవస్థానం పరంగాను, పర్యాటక రంగంగాను చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశ్యంగా కనబడుతోందని బీటెక్ రవి వివరించారు.



ఒక రీల్ చూసి… ఒక గ్రామం మారిపోయింది 

సోషల్ మీడియాలో చూసిన ఒక చిన్న అవగాహన వీడియో… ఇప్పుడు గుండంపల్లి గ్రామంలో పెద్ద మార్పుకు దారి తీసింది. దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామపంచాయతీ వినూత్నంగా “స్టీల్ బ్యాంక్” ఏర్పాటు చేసి, 500 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందుబాటులో ఉంచింది.

గ్రామంలో జరిగే వివాహాలు, విందు కార్యక్రమాలకు అవసరమైన వారు వీటిని తీసుకెళ్లి ఉపయోగించి… తిరిగి శుభ్రం చేసి ఇస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం గణనీయంగా తగ్గింది.

ఇటీవల వైరల్ అయిన వీడియోల్లో పేపర్ ప్లేట్లపై ఉన్న పాలిథిన్ పొర గురించి వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడి ఆహారం వల్ల ప్లాస్టిక్ కరిగి ఆరోగ్యానికి హానికరం అవుతుందని… పర్యావరణానికి కూడా నష్టం కలుగుతుందని చెప్పారు.

గుండంపల్లి తీసుకున్న ఈ చిన్న నిర్ణయం…
పెద్ద మార్పుకు నాంది పలికింది.

ఒక గ్రామంలో 500 స్టీల్ ప్లేట్లు 20 కార్యక్రమాల్లో వాడితే… 10,000 ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం తగ్గినట్టే. అదే ప్రతి గ్రామం చేస్తే… పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుందో ఊహించండి.

నిర్మల్ జిల్లా పంచాయతీ కార్యాలయాల్లో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి… స్టీల్ వస్తువులనే ఉపయోగిస్తున్నారు. మోదుగ ఆకులతో తయారయ్యే విస్తరాకులు కూడా మంచి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి.

 వీడియోలు చూడటం ఒక్కటే కాదు…
మార్పు మన నుంచే మొదలవ్వాలి.

చిన్న అలవాటు మార్చితే…
పెద్ద ప్రకృతి కాపాడినట్టే. 


యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయ ఆభరణాల దొంగతనం..

*నిందితుడి అరెస్ట్, 230 గ్రాముల సొత్తు స్వాధీనం...*

యడ్లపాడు: భక్తితో నమ్మకంగా కొలిచే ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన వెండి,బంగారు ఆభరణాల దొంగతనంతో సంబంధం ఉన్న కేసులో ఎడ్లపాడు ఎస్సై శివరామకృష్ణ మరియు సిబ్బంది ఓ నిందితుడిని అరెస్ట్ చేసి 230 గ్రాముల వెండి‑బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

*నిందితుడి అరెస్ట్ వివరాలు..*

యడ్లపాడు గ్రామానికి చెందిన 43 ఏళ్ల మద్దుల రమణారావు (తండ్రి: మద్దుల హనుమంతరావు)ను తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న బజారు ప్రాంతంలో 2026, మార్చి 31వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.అతనిపై యడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెం. 17/2026 కింద U/S 303(2), 305(d), 306 BNS సెక్షన్లతో పాటుగా దర్యాప్తు కొనసాగించండంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు.ఆభరణాల దాచిన స్థలం,స్వాధీనం అరెస్ట్ అనంతరం తన వాంగ్మూలంలో నిందితుడు దొంగిలించిన ఆస్తులను కనమర్లపూడిలోని శ్రీహరిరావు ఇంటి వద్ద దాచినట్లు తెలిపాడు. దీనిమేరకు దర్యాప్తు అధికారి మధ్యవర్తుల సమక్షంలో సంబంధిత ప్రదేశానికి చేరుకుని ఆభరణాలను సీజ్ చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న ఆభరణాలన్నీ యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన చోరీ సొత్తే అని అధికారులు గుర్తించారు.

*స్వాధీనమైన ఆభరణాల వివరాలుసీజ్..*

వెండి వస్తువులు (మొత్తం 216 గ్రాములు)తమలపాకుల తోరణం – 142 గ్రాములునామాలు మరియు నేత్రాలు – 42 గ్రాములురెండు జతల ఉత్తర జంద్యాలు – 14 గ్రాములుమెట్టెలు మరియు పిల్లేళ్లు – 20 గ్రాములుబంగారు ఆభరణాలు (మొత్తం 14 గ్రాములు)మంగళసూత్రం – 4 గ్రాములురెండు జతల బంగారు నేత్రాలు – 10 గ్రాములుపై ఆస్తులను ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గుర్తించి, తదుపరి దర్యాప్తు కోసం పోలీసులు సీజ్ చేశారు. నిందితుడు మద్దుల రమణారావును అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కు తరలించి,కేసులో ఇతర అంశాలు, మధ్యవర్తి పాత్రలపై కూడా క్లుప్త దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు.


*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి హిందూ దేవాలయాల భూముల ఆక్రమణ పై వినతి పత్రం సమర్పించడం జరిగింది*

*విషయం: హిందూ దేవాలయ భూముల రక్షణ, అక్రమణల నివారణ శిధిలావస్థ లో ఉన్న ఆలయాలు పునఃనిర్మాణం మరియు ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై  వినతిపత్రం*

హిందూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. ఈ ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు దేవుని ఆస్తులు, కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలు. అయితే ప్రస్తుతం ఈ భూముల విషయంలో జరుగుతున్న పరిణామాలు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఈ మధ్య ఆకివీడు రామాలయ పునఃనిర్మాణం లో జరిగిన అల్లర్లు, నవమి రోజున జరిగిన దాడులు స్వయంగా స్పీకర్ నే హత్య చేయాలనుకునే ప్రయత్నం  పై యావత్ హిందు సమాజం ఆందోళనకు గురవుతుంది. సంవత్సరాలు గా ఆలయాల పునఃనిర్మాణాలు జరగకపోవడం వలన హిందు సమాజం నష్టపోతుంది. రాష్ట్రంలో శిధిలావస్థలో ఉన్న అన్ని ఆలయాలు పునఃనిర్మించాలి.

హిందు ఆలయాల మొత్తం భూమి సుమారు 4.7 లక్షల ఎకరాలు, 1.5 లక్షల ఎకరాలు అక్రమణకు గురయ్యాయి, అభివృద్ధి పేరు తో 8000 ఎకరాలు ప్రభుత్వం తీసేసుకుంది. లక్షల కోట్ల విలువ చేసే భూములు హిందు ఆలయాల నుంచి  మల్లించబడుతున్నాయి మరియు ఆక్రమించబడుతున్నాయి.

దేవాలయాలకు సంబంధించిన లక్షన్నర ఎకరాలకు పైగా భూములు “ప్రైవేట్ వ్యక్తుల సర్వే నంబర్లలో కలిసిపోయాయి” అనే పేరుతో సరైన ధర్యాప్తు చేయకుండా, ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఇది హిందూ సమాజానికి, ఆలయ రక్షణకు తీవ్రమైన ప్రమాదకరం. ఈ చర్యలు ద్వారా ఆలయాలు తీవ్రంగా నష్టపోతాయి.

అలాగే, GO No. 139 ద్వారా 33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల పేరుతో అర్బన్ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే విధానం కూడా పూర్తిగా వ్యతిరేకించదగినది. ఈ నిర్ణయం వల్లే హిందూ సమాజం కోర్టులను ఆశ్రయించి స్టే ఆదేశాలు తెచ్చుకోవలసిన పరిస్థితి వచ్చింది.

హిందూ ఆలయ భూములు అభివృద్ధి పేరుతో ఇతరుల చేతుల్లోకి వెళ్లడం అంగీకారయోగ్యం కాదు.
హిందూ ఆలయ భూములు ఆలయాలకే చెందాలి ఇదే భారతీయ జనతా పార్టీ స్పష్టమైన అభిప్రాయం. ఇంకా, ఆలయ భూములను ఆక్రమించుకున్న వారికి రెగ్యులరైజేషన్ పేరుతో చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ఆలోచించడం కూడా అత్యంత ప్రమాదకరం. ఇది అక్రమాలను ప్రోత్సహించడమే అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో  కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుంది. ఆలయ భూముల రక్షణలో కూడా ఆ పారదర్శకత ఉండాలి.

ప్రస్తుతం పరిస్థితులు చూస్తే, గత ప్రభుత్వ ఆలోచనలు కొనసాగిస్తూ కొంతమంది అధికారులలో ఆలయ భూములను రక్షించాలనే దృక్కోణం కాకుండా, వాటిని దారి మళ్లించాలి, దోచిపెట్టాలి అనే ధోరణి కనిపించడం హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తోంది. ఇటువంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేము.

దేవాలయాల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ, అదే ఆలయాల అభివృద్ధి, పండుగల నిర్వహణకు ప్రభుత్వం సరైన మద్దతు ఇవ్వకపోవడం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. అలాగే ఆలయ అదాయాల నుంచి కామన్ గుడ్ ఫండ్, అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ ప్రభుత్వం తీసుకుంటుంది.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది...

• దేవాలయ భూములపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి, ప్రైవేట్ సర్వే నంబర్లలో కలిసిపోయిన భూములపై నిష్పక్షపాత ధర్యాప్తు చేయాలి.
• దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసే నిర్ణయాలను వెంటనే నిలిపివేయాలి.
• GO No. 139 ను పూర్తిగా రద్దు చేయాలి.

• 33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల విధానాన్ని ఉపసంహరించాలి.

• ఆలయ భూముల ఆక్రమణలను రెగ్యులరైజ్ చేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి.

• అక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని భూములను తిరిగి ఆలయాలకు అప్పగించాలి.

• దేవాలయాల ఆదాయం పూర్తిగా అదే ఆలయాల అభివృద్ధికి వినియోగించే విధంగా చట్టపరమైన హామీ ఇవ్వాలి.

• ఆలయాల పండుగల నిర్వహణకు ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించాలి.

• CGF నిధులతో శిధిలావస్థ ఆలయాలు పునఃరిద్దరించాలి.

• అభివృద్ధి పేరుతో ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న భూమికి తగిన భూమి లేదా నష్టపరిహారం ఆయా ఆలయాలకు ఇవ్వాలి.

ఇది కేవలం వినతిపత్రం కాదు హిందూ సమాజం యొక్క గళం. దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఆలయ హక్కుల రక్షణ కోసం ఉద్యమం చేయడం తప్ప మాకు మరే మార్గం ఉండదు. హిందూ ఆలయ భూములు కాపాడాలి అవి ఆలయాలకే చెందాలి అని అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కోరుచున్నది.





పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సనాతన హిందూ సాంప్రదాయ పండుగలకు ప్రభుత్వ నిధులు కేటాయించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సనాతన హిందూ సాంప్రదాయ పండుగలకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా బీజేపీ యువ నాయకులు ఇంగ్గుటూరి రాజశేఖర్ రెడ్డి సంఘ రాష్ట్ర కార్యదర్శి సింగరేసు పోలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*

*వినతి పత్రం స్వీకరించిన డిఆర్ఓ గారు వెంటనే దేవాదాయ శాఖ వారిని పిలిచి ఈ సమస్యపై స్పందించి నిధులు కేటాయించాలని కోరారు*

*పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి సమర్పించిన వినతి పత్రం*

*విషయం: వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి – ఉగాది కొనుగోలు మార్కెట్లలో ప్రజలకు తగిన సదుపాయాలు కల్పించాలి – సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి వినతి*

*ఇటీవల సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులకు  ప్రజలు, ఆలయ కమిటీలు, ధర్మదాతలు మరియు భక్తుల నుండి ముఖ్యమైన వినతులు అందాయి. త్వరలో ప్రారంభం కానున్న వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి పర్వదినాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ సహకారం అవసరమని వారు కోరారు*

*భారతీయ సంస్కృతిలో వసంత ఋతువు అత్యంత పవిత్రమైన మరియు ఆధ్యాత్మికమైన కాలంగా భావించబడుతుంది. ఉగాది నుండి ప్రారంభమయ్యే వసంత నవరాత్రులు మరియు అనంతరం జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలు భక్తులకు అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పర్వదినాలు. ఈ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు, హోమాలు, సీతారామ కల్యాణాలు, భజనలు, హరికథలు వంటి కార్యక్రమాలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతాయి*

*అదే సమయంలో వసంత నవరాత్రులు అమ్మవారికి కూడా అత్యంత ప్రియమైన పర్వదినాలుగా భావించబడుతాయి. అందువల్ల గ్రామాలలో ఉన్న అమ్మవారి ఆలయాలు మరియు గ్రామ దేవతల ఆలయాల్లో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయం*

*ఈ ఉత్సవాలు ప్రజల్లో భక్తి, ఐక్యత, సంస్కృతి మరియు సంప్రదాయాల పరిరక్షణకు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి*

*అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక గ్రామాలు మరియు పట్టణాల్లో ఉన్న రామాలయాలు, అమ్మవారి ఆలయాలు మరియు గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల ఆలయ కమిటీలు మరియు భక్తులు ఇబ్బందులు పడుతున్నారని జనతా వారధి పర్యటనలో వెల్లడైంది*

*కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని ఆలయాల్లో వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము*

ఈ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ముఖ్యమైన ఏర్పాట్లు:
• ఆలయ ప్రాంగణాల శుభ్రపరిచే పనులు
• విద్యుత్ దీపాలంకరణలు మరియు ఆలయాల అలంకరణ
• వసంత నవరాత్రుల ప్రత్యేక పూజలు మరియు హోమాల నిర్వహణ
• శ్రీ సీతారామ కల్యాణం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు
• భక్తులకు ప్రసాదం మరియు అన్నదానం కార్యక్రమాలు
• హరికథలు, భజనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు
• భక్తులకు తాగునీరు మరియు ఇతర మౌలిక సదుపాయాలు
• భక్తులకు కూర్చునే సదుపాయాలు మరియు తాత్కాలిక పందిళ్లు
• భక్తుల భద్రత కోసం తగిన ఏర్పాట్లు
• ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత నిర్వహణ

*అలాగే ఉగాది సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉగాది పచ్చడి కోసం అవసరమైన పదార్థాలు, పండ్లు, పూలు మరియు ఇతర వస్తువులను కొనుగోలు చేసే మార్కెట్ ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది*

అందుకోసం:
• మార్కెట్ ప్రాంతాల్లో శుభ్రత నిర్వహణ
• తాగునీటి సదుపాయం
• ట్రాఫిక్ నియంత్రణ
• తాత్కాలిక షెడ్లు మరియు ప్రజలకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు
• భద్రత మరియు ప్రజా సౌకర్యాల ఏర్పాటు

ఇలాంటి ఏర్పాట్లు ప్రభుత్వ సహకారంతో జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించబడటమే కాకుండా భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుంది.
-కాబట్టి రాష్ట్రంలోని అన్ని రామాలయాలు, అమ్మవారి ఆలయాలు మరియు గ్రామ దేవతల దేవాలయాల్లో వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని గౌరవనీయ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారిని వినమ్రంగా కోరుతున్నాము


*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి*
*ఆంధ్రప్రదేశ్*



 

ఒంటిమిట్ట కోదండ రామాలయ పుష్కరిణి దగ్గర దర్గా.. ఆక్రమణ కాదా?

ఒంటిమిట్ట కోదండ రామాలయ పవిత్రతను కాపాడుకుందాం!
​ఆంధ్రప్రదేశ్ భద్రాచలంగా వెలుగొందుతున్న ఏకశిలా నగరం ఒంటిమిట్ట. స్వామివారికి అత్యంత పవిత్రంగా తెప్పోత్సవం నిర్వహించే చెరువు నీటిని ఆనుకొని ఒక దర్గా వెలవడం ఎంతవరకు సమంజసం? మన ధర్మం మరియు సంప్రదాయాల ప్రకారం అత్యంత ప్రాశస్త్యం ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాలు రావడం వెనుక ఆంతర్యం ఏమిటి?

​నేను అడిగే ప్రశ్నలు ఇవే:
​ఇస్లాం సిద్ధాంతాలకు ఇది విరుద్ధం కాదా? - నిజమైన ముస్లింలు ఖురాన్ మీద ఒట్టేసి చెప్పగలరా? అల్లాహ్ మరియు మహమ్మద్ ప్రవక్తను తప్ప వేరే ఎవరినీ పూజించకూడదని, సమాధులకు మొక్కకూడదని మీ మతం చెబుతోంది కదా! మరి ఈ దర్గాల సంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది?

​ఆక్రమణలు ధర్మం అనిపించుకుంటాయా? - అల్లాహ్ చెప్పిన మాట వినకుండా, ఇలాంటి దర్గాల పేరుతో ఆక్రమణలు చేస్తూ సాక్షాత్తూ మీ దేవుడినే అవమానిస్తున్నది ఎవరు?

​సమానత్వం అంటే ఇదేనా? - రేపు పొద్దున మక్కా మసీదు పక్కన వేరే దేవాలయం కడితే అంగీకరిస్తారా? అక్కడ లేని నియమం ఇక్కడ ఒంటిమిట్ట రామాలయ చెరువు దగ్గర ఎందుకు వర్తించదు?

​నా ఉద్దేశ్యం ఒక్కటే:
నాకు వ్యక్తుల మీద ద్వేషం లేదు. ఇస్లాం సిద్ధాంతాలను నూటికి నూరు శాతం పాటించే వ్యక్తులంటే నాకు గౌరవం ఉంది. కానీ, మతం పేరు చెప్పుకొని ఇలాంటి ఆక్రమణలకు పాల్పడే వారి వైఖరి పట్లే నా అభ్యంతరం.
​మనం ఇప్పుడు మౌనంగా ఉంటే, రేపు పొద్దున "ఇది ఎప్పటి నుండో ఇక్కడే ఉంది.. దీన్ని తీయకూడదు" అని పంచాయతీలు మొదలవుతాయి. అందరూ ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే అని మనం సర్దుకుపోతుంటే, మన పుణ్యక్షేత్రాల పవిత్రత కనుమరుగైపోయే ప్రమాదం ఉంది.

​నిజమైన ముస్లింలు ఈ విషయంలో ఆలోచించాలి. మన ధర్మాన్ని, మన ఆలయాల ప్రాశస్త్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత!





పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లొ ఫిర్యాదు చేసిన సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు

*జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పశువుల అక్రమ రవాణాపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు చిలకలూరిపేట నేషనల్ హైవే లో జరుగుతున్న పశువుల అక్రమ రవాణాపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా కలెక్టర్ గారు స్పందించి తగు చర్యలు తీసుకుంటామని పరిరక్షణ సమితి సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది*

*ఈ కార్యక్రమంలో ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి వరికూటి నాగేశ్వరరావు జాతీయ ఉపాధ్యక్షులు వంకాయలపాటి వంశీధర్ అలాగే పల్నాడు జిల్లా బిజెపి నాయకులు అందరూ ఫిర్యాదు ఇచ్చిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*