ఒంటిమిట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒంటిమిట్ట అభివృద్ధిపై స్థానిక నేతలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఆయన చెప్పింది ఏంటంటే.. ఎప్పుడూ కూడా ఒంటిమిట్ట చెరువు నీటితో కళకళలాడాలి.
సోమశిల బ్యాక్ వాటర్ కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. దీని మీద ఏదైనా ఇరిగేషన్ ఉన్నా కూడా, ఆ తర్వాత ఇన్-ఫ్లో, అవుట్-ఫ్లో కూడా ఈక్వల్ గా పెట్టి ఎప్పుడూ చెరువు కళకళలాడుతూ ఉండాలి. నేషనల్ హైవే కొంచెం దూరంగా పోతుంది, మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది. ఆ నేషనల్ హైవే నుంచి రైల్వే ట్రాక్ మీద ఓవర్ బ్రిడ్జి కూడా ప్లాన్ చేసి ఒక టౌన్ ప్లాన్ సిద్ధం చేయాలి.
ల్యాండ్ ఏమన్నా ఉంటే చూసి టెక్స్‌టైల్ పార్క్ కానీ, హ్యాండ్‌లూమ్ పార్క్ కానీ ఇంకా ఏదైనా రెవెన్యూ జనరేట్ అయ్యేటట్టుగా ఏదైనా మంచి కంపెనీలు కూడా స్టార్ట్ చేసి.. ఇంకా కొండ మీద, ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఫారెస్ట్ వాళ్లను సంప్రదించి మంచి మంచి చెట్లు అవన్నీ నాటి ఇదొక అద్భుతమైన పర్యాటక సెంటర్ గా మారాలి. భవిష్యత్తులో ఈ ఒంటిమిట్ట అనేది ఒక అద్భుతమైన దేవస్థానం పరంగాను, పర్యాటక రంగంగాను చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశ్యంగా కనబడుతోందని బీటెక్ రవి వివరించారు.
Post A Comment:
0 comments: