ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణం :*
*ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. శ్రీరామనవమికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. చైత్ర పౌర్ణమికి ముందు రాత్రి పండువెన్నెల్లో కల్యాణం నిర్వహిస్తారు. ఒంటిమిట్ట కోదండరామయ్య వైభవం, కల్యాణాన్ని వీక్షించడం భక్తుల పూర్వజన్మ సుకృతమే.*

*శ్రీరామక్షేత్రాలు అన్నింటా సీతారామ కల్యాణం మిట్టమధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో చేయడం సంప్రదాయం. అందుకు విరుద్ధంగా ఒంటిమిట్టలో శుక్ల పక్ష చతుర్దశినాటి రాత్రి పండువెన్నెల్లో రామకల్యాణం నిర్వహిస్తారు. అలా రాత్రిపూట వెన్నెల్లో స్వామివారి కల్యాణం నిర్వహించడానికి ఆసక్తికరమైన గాథ ఒకటి ప్రచారంలో ఉంది. చిన్నతనం నుంచి శ్రీరాముడికి చంద్రుడంటే అత్యంత ఇష్టం. చందమామ అచ్చంగా కావాలని మారాం చేసిన బాలరాముడికి అద్దంలో చందమామను చూపెట్టిన* *గాథ అందరికీ తెలిసినదే. అటువంటి శ్రీరాముడి కల్యాణం మధ్యాహ్నం జరిగింది. దీనితో చంద్రుడు శ్రీరామ కల్యాణం చూడలేకపోయాడు. తీవ్రమైన దుఃఖానికి, బాధకు లోనయ్యాడు. ఈ విషయం శ్రీరాముడికి తెలిసి చంద్రుడిని ఓదార్చి మూడువరాలు ప్రసాదించాడు. ఆ వరాలేమిటంటే, రామభద్రుడు ఆనాటి నుంచి శ్రీరామచంద్రుడిగా ప్రసిద్ధుడు కావడం. తరువాతి జన్మలో శ్రీకృష్ణునిగా రాత్రిపూట జన్మించడం. కలియుగంలో రాత్రిపూట కల్యాణం చేసుకోవడం. అలా చంద్రుడికిచ్చిన మూడోవరంలో భాగంగా రాత్రి ఆ సమయంలో చైత్ర పౌర్ణమికి ముందురోజు చంద్రుడు ఆకాశం నుంచి చూస్తూ పండువెన్నెల కురిపిస్తూ ఉండగా ఒంటిమిట్టలో రామయ్య కల్యాణం జరుగుతుంది.*

Axact

సనాతన ధర్మ పరిరక్షణ సమితి

సనాతన ధర్మ పరిరక్షణ సమితి - సనాతన ధర్మ పరిరక్షణ సమితి - సనాతన ధర్మ పరిరక్షణ సమితి

Post A Comment:

0 comments: