April 2026


 

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన మాన్ మోహన్ గౌడ్*


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన మాన్ మోహన్ గౌడ్ . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా మాన్ మోహన్ గౌడ్ తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన మాన్ మోహన్ గౌడ్.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన మాన్ మోహన్ గౌడ్.

అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన మాన్ మోహన్ గౌడ్.

సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన మాన్ మోహన్ గౌడ్.

హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కన్వీనర్ మాన్ మోహన్ గౌడ్ అన్నారు.



 

*చిలకలూరిపేటలో మారుమోగిన గోమాత నామస్మరణ: తహసిల్దార్‌కు హిందూ సంఘాల వినతికార్యక్రమం లొ పాల్గొన్న సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి*


*చిలకలూరిపేట, ఏప్రిల్ 27, 2026:*
భారతీయ సంస్కృతికి మూలస్తంభమైన గోమాతను సంరక్షించుకోవడమే ధ్యేయంగా నేడు చిలకలూరిపేట పట్టణంలో హిందూ సంఘాలు మరియు గో సేవకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ నుండి ప్రారంభమై దేశం నలుమూలలా సాగుతున్న ఈ గోమాత పూజా కార్యక్రమాలు మరియు ర్యాలీల పరంపరలో భాగంగా, నేడు స్థానిక పట్టణంలో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

*ర్యాలీ విశేషాలు:*
భారీ ప్రదర్శన: పట్టణ ప్రధాన వీధుల గుండా వందలాది మంది గో సేవకులు, భక్తులు గోమాత చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు.

*గోమాత శరణు ఘోష:* ర్యాలీ పొడవునా భక్తులు చేసిన "గోమాత శరణు" నినాదాలతో చిలకలూరిపేట పురవీధులు మారుమోగాయి.

*పూజా కార్యక్రమాలు:* మార్గమధ్యంలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భారతీయ జీవన విధానంలో ఆవు యొక్క ప్రాముఖ్యతను చాటిచెప్పారు.

*వినతిపత్రం సమర్పణ:*
ర్యాలీ అనంతరం హిందూ సంఘాల ప్రతినిధులు స్థానిక
తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. గోవుల సంరక్షణకు కఠిన చట్టాలు అమలు చేయాలని, గోవధను పూర్తిగా నిషేధించాలని కోరుతూ తహసిల్దార్ గారికి వినతిపత్రాన్ని అందజేశారు.

> "గోమాత కేవలం ఒక జంతువు కాదు, అది కోట్లాది మంది భారతీయుల విశ్వాసం. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ చైతన్య యాత్రలో భాగంగా చిలకలూరిపేటలో ఈరోజు భారీ స్పందన లభించింది." అని సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక హిందూ ధర్మ ప్రచారకులు, సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో గో ప్రేమికులు పాల్గొన్నారు.



 

 

*హిందూ దేవదాయ చట్టం  30/ 1987*

హిందూమతంపై ప్రత్యక్షంగా,పరోక్షంగా గాని దాడి చేయడం లేదా అసభ్యకరమైన పదజాలంతో మతమును కించపరిచే వారి నుండి  భారత రాజ్యాంగంలో  చట్టాలు చేయబడిన  నియమ నిబంధనలతో అడ్డంకులను నిరోధించడం ఎలా ??

*హిందూ దేవాదాయ చట్టము  30/1987*

హిందూ దేవాదాయ చట్టప్రకారం హిందూ దేవాలయాల చుట్టుప్రక్కల, హిందూ నివాసగృహాల మధ్య పరిసర ప్రాంతాలలో రోడ్లపై పోస్టల్ బ్యానర్లు, మైక్ సెట్ ద్వారా ప్రార్థనల వంటి అన్యమత ప్రచారం నిషేధించడమైనది. అతిక్రమించిన వారు జి. ఓ 746,747  ప్రకారం అరెస్టయితే బెయిల్ లభ్యంకాని  శిక్షలకు అర్హులవుతారు.

      30/1987 ప్రకారం దేవాలయ ఆవరణలో పాన్,సిగరేటు,ఉమ్మివేయడం వంటి ఆకృత్యాలు చేసినను హిందువులైనప్పటికీ శిక్షకు అర్హులవుతారు .మసీదు, చర్చి వంటి అన్యమత ప్రార్దన మందిరాలు నిర్మించ తలపెట్టినప్పుడు కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా పొందాలి.

ఎక్కడైనా కలెక్టరు లేదా ఆ పరిసర ప్రాంత సబ్ ఇన్స్పెక్టర్ లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్  ద్వారా అనుమతి పొందిన పత్రాలు లేకుండా వ్యక్తిగత ప్రసారం లేదా వాహనాల ద్వారా ప్రసారం చేసిన అటువంటి ప్రసారాలను అడ్డుకునే విషయములో గ్రామాధికారులు అధికారము కలిగి ఉంటారు.

      హిందూ మతాన్ని దూషించడం, అసభ్యకరంగా మాట్లాడడం చేసినయెడల ipc 295 (1), ఒకవేళ హిందూ దేవుళ్లను గురించి  మాట్లాడుతూ  ఆ సంస్కృతి పరువు  తీసిన  తీసివేయుటకు వంటి విషయములను  ముద్రించడం  లేదా  ముద్రించి  విక్రయించడం  చేసినయెడల ipc 501,502(2) క్రింద కేసును నమోదు చేయమని,
దేవుడి పేరు చెప్పి,  మతం పేరుచెప్పి  భయోత్పాతం  కలిగించుట  వంటి కార్యకలాపాలు చేపట్టిన  ఎడల  ipc 503 సెక్షన్ ప్రకారం  కేసు నమోదు చేయమని  కోరడం,
మత విశ్వాసాలను  విశ్వసించక పోతే  దేవుడు శపిస్తాడని  లేదా అనేక కార్యకలాపాల్లో  మీకు అసౌకర్యం కలుగుతుందని మిమ్మల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తే ipc 508 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని కలెక్టరు లేదా సమీప పోలీస్ స్టేషన్ అధికారులను కోరవచ్చును.

      ఈ విషయంలో అన్యమత ప్రచారం జరుగుతుందని ఫోన్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసిన వెంటనే  పోలీసు శాఖ వారు స్పందించని ఎడల ఫిర్యాదుదారులు నేరుగా కలెక్టర్ గారికి లిఖిత పూర్వక ఉత్తరాల ద్వారా సవివరాలతో సబ్ ఇన్స్పెక్టర్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ పై 219 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని న్యాయ సంబంధమైన విషయములు చట్ట విరుద్ధంగా వ్యవహరించి అందుకుగాను 217 సెక్షన్ ప్రకారం నేరస్తులను కాపాడే ప్రయత్నం చేసినందుకు గాను కేసు నమోదు చేయమని కోరవచ్చును.



*జైశ్రీరామ్ జై హింద్*


 

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తిరుపతి జిల్లా కన్వీనర్ గా నియమితులైన కమ్మర విష్ణువర్ధన్ రావు*


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన తిరుపతి జిల్లా కన్వీనర్ గా నియమితులైన కమ్మర విషువర్ధన్ రావు . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా కమ్మర విష్ణువర్ధన్ రావు తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన కమ్మర విష్ణువర్ధన్ రావు.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన కమ్మర విషువర్ధన్ రావు .

అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన కమ్మర విషు వర్ధన్ రావు .

సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన కమ్మర విష్ణువర్ధన్ రావు .

హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కన్వీనర్ కమ్మర విషువర్ధన్ రావు అన్నారు.




 

 

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ గా నియమితులైన జి ఎన్ రావు*


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ గా నియమితులైన జి ఎన్ రావు. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా జి ఎన్ రావు తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన జి ఎన్ రావు.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన జి ఎన్ రావు.

అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన జి ఎన్ రావు.

సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన జి ఎన్ రావు.

హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ జి యన్ రావు అన్నారు.





 

*వైశాఖమాస ప్రారంభం* :

వైశాఖమాసం తెలుగు నెలల్లో రెండోది. వసంతశోభ వెల్లివిరిసే సమయమిది. ఇదే తరుణంలో ఎండలు ముదురుతుంటాయి. అందుకే వైశాఖం పచ్చిందంటే మనవారు కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. మండువేసవిలో మంచినీళ్లు దానం చేయడం. కంటే గొప్పది లేదంటారు. దాహంతో ఉన్నవారికి మంచినీళ్లివ్వడం, ఆకలిగొన్నవాడికి అన్నం పెట్టడమే అన్నింటికంటే గొప్ప ధర్మాలు. అవే మనం సంపాదించుకోదగిన అసలైన పుణ్యాలు. ఆ బాటలో నడవాలి. మనం చేసుకునే పుణ్యకార్యక్రమాలకు లక్ష్మీదేవి స్వయంగా అక్షయ ఫలాలను అనుగ్రహించే మహత్తర పర్వదినం అక్షయ తృతీయ. ఆరోజు మహాలక్ష్మీపూజ నిర్వహిస్తారు. పొదుపుకి, మదుపుకి అనుకూలంగా ఆనాడు కొద్దిగానైనా బంగారాన్ని కొనుక్కోమని పెద్దలు చెబుతుంటారు.

ఆరోజునే సింహాచలం లక్ష్మీనరసింహ స్వామికి చందనోత్సవం నిర్వహిస్తారు. ఏడాది పొడవునా చందనపు పూతలోనే దర్శనమిచ్చే ఆ స్వామి నిజరూపాన్ని చూడగలిగే ఒకే ఒక్కరోజు అక్షయ తృతీయ.

బదరీ నారాయణుడు, కేదారనాథుడు తమ దర్శనాలను అనుగ్రహించే శుభతరుణం కూడా ఇదే. పరశురాముడు, ఆదిశంకరుడు మొదలు ఎందరెందరో విశ్వగురువులు తెలుగు నెలల ప్రకారం వైశాఖంలోనూ. ఇంగ్లీషు నెలల ప్రకారం మే మాసంలోనే పుట్టడం యాదృచ్ఛికం. గౌతమబుద్ధుడు, రామానుజులు, వీరబ్రహ్మేంద్రస్వామి, బసవేశ్వరుడు వంటి గురువులు ఈమాసంలోనే పుట్టారు. దైవాలు సైతం ఈమాసంలోనే పుట్టారు. శుక్లపక్షం చివరిలో నృసింహ జయంతి నాడు, బహుళపక్షంలో హనుమజ్జయంతి నాడు వస్తాయి. నృసింహజయంతి సందర్భంగా ఆలయాలన్నింటిలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.

వైశాఖానికి మాధవమాసమని పేరున్న కారణంగా అనేక వైష్ణవాలయాల్లో కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణం కూడా ఈ మాసంలోనే జరగనుంది. అదే కాకుండా తెలుగునాట అనేక జాతరలు కూడా జరగబోతున్నాయి. ఆ దేవీ దేవతలందరూ మనందరినీ చల్లగా చూడాలని, అందరికీ క్షేమం కలగాలని కోరుకుందాం.





*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతష్ నాయుడు*

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతీష్ నాయుడు. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా తోట సతీష్ నాయుడు తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన తోట సతీష్ నాయుడు.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన తోట సతీష్ నాయుడు.

అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన తోట సతీష్ నాయుడు.

సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన తోట సతీష్ నాయుడు.

హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కార్యదర్శి తోట సతీష్ నాయుడు అన్నారు.

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ మరియు కూటమి ఆధ్వర్యంలో  టిడ్కో గృహ సముదాయంలో జరిగిన భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమంనిర్వహించడం జరిగింది*

**చిలకలూరిపేట నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కమిటీ మరియు కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు  వేడుకల్లో భాగంగా *శ్రీరామనవమి 16 రోజుల పండగ వేడుకలుఘనంగా నిర్వహించడం జరిగింది*

*ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం లొ భాగంగా , *52 ఎకరాల టిడ్కో గృహ సముదాయ ఆవరణలో భారీ
అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది*.

*ఈ కార్యక్రమం లొ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కమిటీ సభ్యులు స్థానిక బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు మరియు స్థానిక హిందూ బంధువులు అందరూ కార్యక్రమం లొ పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేసారు*



 

 

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సలహాదారులు గా నియమితులైన గోవిందు శంకర్ శ్రీనివాసన్


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సలహాదారులు గా నియమితులైన గోవిందు శంకర్ శ్రీనివాసన్ . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా గోవిందు శంకర్ శ్రీనివాస్ తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన గోవిందు శంకర్ శ్రీనివాస్.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన గోవిందు శంకర్ శ్రీనివాస్.

అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన సగోవిందు శంకర్ శ్రీనివాస్ .

సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన గోవిందు శంకర్ శ్రీనివాస్ .
హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సలహాదారులు గోవిందు శంకర్ శ్రీనివాస్ అన్నారు.

                    


 
 
*శ్రీవారు మూడునామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణమేంటి.............!!*

శ్రీవారిని తలచుకోగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఏడుకొండలు, మూడు నామాలు. మూడునామాలు శ్రీవారి రూపుకే ప్రత్యేకంగా కనిపిస్తాయి...

ఈ మూడునామాలను తిరుమల కొండపై పెద్దగా కనిపించేలా ఏర్పరచారు. ఏడుకొండలకు నడక దారిన వెళ్లేటప్పుడు కూడా మూడు నామాల కొండ ఉంటుంది. అది దిగువనున్న తిరుపతికి కూడా కనబడుతుంది..

శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఫోటోలోనూ మూడు నామాలే ప్రత్యేకంగా కనిపిస్తాయి.
అసలు శ్రీవారికి ఈ మూడు నామాలు ఎందుకు ప్రత్యేకం ?
మూడు నామాలే ఎందుకు అలంకరిస్తారు ?
మూడునామాల వాడిగా ప్రసిద్ధ చెందడానికి కారణమేంటి ?
సాక్షాత్తూ ఆ శ్రీ మహావిష్ణువు ధరించి, మనుషులు కూడా ధరించాలని చెప్పినవే మూడు నామాలు. ఈ నామాలు అజ్ఙానాన్ని, కర్మను ఖండిస్తాయని వివరిస్తాయి. మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి మూడు నామాలు అలంకరించారట.

అలా....

శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది. శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులం కస్తూరితో మూడు నామాలు అలంకరిస్తారు. అవి మళ్లీ గురువారం వరకూ అలానే ఉంటాయి. గురువారం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు. అంటే ఎప్పుడూ శ్రీవారు కళ్లు నామాలతో మూసి ఉంటారు. శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు...

ఈ సమయంలో నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకునే అరుదైన, మహత్తరమైన అవకాశం భక్తులకు లభిస్తుంది. శుక్రవారం అభిషేకం తర్వాత మూడు నామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేకం సమయం వరకు ఈ నామం అలాగే ఉంటుంది. అంటే వారానికి ఒకసారి మాత్రమే శ్రీవారికి మూడు నామాలు దిద్దుతారు. శ్రీవారి మూడు నామాలకు ఉపయోగించే తెలుపు, ఎరుపు బొట్టు వెనక చాలా పరమార్థం ఉంది. తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియజేస్తాయి. సత్వగుణం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని సూచించేది నిలువు బొట్టు. ఇక ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక. అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభసూచకం, మంగళకరమైనది. కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు...

శ్రీవారి మూడు నామాలకు మరో అర్థం కూడా ఉంది. వైష్ణవుల్లో వడగలై, తెంగలై అనే రెండు తెగలున్నాయి. వడగలై అనే వాళ్లు యు ఆకారంలో నామం దిద్దుకుంటారు. తెంగలైవారు ఆంగ్ల అక్షరం వై ఆకారంలో తిరునామం దిద్దుకుంటారు. అయితే ఈ రెండు ఆకారాలకు మధ్యస్థంగా తమిళ అక్షరం ప ను పోలి ఉంటుంది. దీన్నే తిరుమణి కావుగా పిలుస్తారు. అలా శ్రీవారికి మూడు నామాలు ప్రత్యేకమైయ్యాయి.

 

తోళప్పాచార్యుల కైంకర్యం 

 తిరుమలనంబి వంశీయుల భక్తి, సేవాభావం నేటికీ తిరుమలలో జీవంగా కొనసాగుతోంది. ప్రతి శుక్రవారం తెల్లవారుజామున—సుమారు ఒక గంట సమయంలో—రక్షక సిబ్బంది వెంట, దివిటీల వెలుగులో, వారు కాలినడకన అరణ్య మార్గంలో సుమారు మూడు మైళ్ళు ప్రయాణిస్తారు.

 వారు మూడు బిందెలతో పవిత్రమైన ఆకాశగంగ తీర్థం నుండి జలాన్ని తెచ్చి, మేళతాళాలతో శ్రీవారి ఆలయంలోకి ఘనంగా ప్రవేశిస్తారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఒక అపూర్వమైన కైంకర్యంగా నిలిచింది.

ఈ ప్రయాణంలో మధ్యలో ఉన్న “బాట గంగమ్మ” ఆలయానికి చేరుకొని, ఆ అమ్మవారికి నమస్కరిస్తూ ఆశీర్వాదం తీసుకోవడం కూడా సంప్రదాయం. ఈనాటికీ ఆ అరణ్యమార్గంలో ఉన్న బాట గంగమ్మ ఆలయం, అలాగే ఆకాశగంగ తీర్థం భక్తులకు దర్శనమిస్తూనే ఉన్నాయి




 

*ప్రతి గుడి ముందు ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా*?

*ధ్వజస్థంభం... ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తరువాతే లోపలికి వెళతాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఒక కథ ఉంది.*

*భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలుపెడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమని చెబుతాడు.*

*ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు.
*తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూర ధ్వజుడ్ని యుద్ధంలో జయించడం సాధ్యం కాదని మహాబలపరాక్రమవంతులైన భీమార్జునేలే ఓడిపోయారని అతడ్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెబుతాడు.
*శ్రీక్రిష్ణుడు ధర్మరాజులతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరతాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డువచ్చి ఇతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూర ధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే ఇతడ్ని వదిలేస్తానని చెప్పిందని, కనుక ప్రభువులు మా యందు దయతలచి శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరుతారు.
*వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెబుతాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూర ధ్వజుడు మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడిభాగం పరోపకారానికి ఉపయోగపడింది. కానీ ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు.
*మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి మయూరధ్వజా నీ దానగుణం అమోఘం. ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు. పరమాత్మా.. నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలా అనుగ్రహించండి.. అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని పలికి... మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది.
*ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం, నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూసే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్థంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమైంది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తరువాతే మూల విరాట్లు దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది.


ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఒంటిమిట్ట అభివృద్ధి* *అద్భుత పర్యాటక కేంద్రంగా మారుస్తాం*  *సీఎం సమీక్షా సమావేశం వివరాలను వెల్లడించిన బీటెక్ రవి

ఒంటిమిట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒంటిమిట్ట అభివృద్ధిపై స్థానిక నేతలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఆయన చెప్పింది ఏంటంటే.. ఎప్పుడూ కూడా ఒంటిమిట్ట చెరువు నీటితో కళకళలాడాలి.

సోమశిల బ్యాక్ వాటర్ కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. దీని మీద ఏదైనా ఇరిగేషన్ ఉన్నా కూడా, ఆ తర్వాత ఇన్-ఫ్లో, అవుట్-ఫ్లో కూడా ఈక్వల్ గా పెట్టి ఎప్పుడూ చెరువు కళకళలాడుతూ ఉండాలి. నేషనల్ హైవే కొంచెం దూరంగా పోతుంది, మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది. ఆ నేషనల్ హైవే నుంచి రైల్వే ట్రాక్ మీద ఓవర్ బ్రిడ్జి కూడా ప్లాన్ చేసి ఒక టౌన్ ప్లాన్ సిద్ధం చేయాలి.

ల్యాండ్ ఏమన్నా ఉంటే చూసి టెక్స్‌టైల్ పార్క్ కానీ, హ్యాండ్‌లూమ్ పార్క్ కానీ ఇంకా ఏదైనా రెవెన్యూ జనరేట్ అయ్యేటట్టుగా ఏదైనా మంచి కంపెనీలు కూడా స్టార్ట్ చేసి.. ఇంకా కొండ మీద, ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఫారెస్ట్ వాళ్లను సంప్రదించి మంచి మంచి చెట్లు అవన్నీ నాటి ఇదొక అద్భుతమైన పర్యాటక సెంటర్ గా మారాలి. భవిష్యత్తులో ఈ ఒంటిమిట్ట అనేది ఒక అద్భుతమైన దేవస్థానం పరంగాను, పర్యాటక రంగంగాను చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశ్యంగా కనబడుతోందని బీటెక్ రవి వివరించారు.


 

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణం :*
*ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. శ్రీరామనవమికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. చైత్ర పౌర్ణమికి ముందు రాత్రి పండువెన్నెల్లో కల్యాణం నిర్వహిస్తారు. ఒంటిమిట్ట కోదండరామయ్య వైభవం, కల్యాణాన్ని వీక్షించడం భక్తుల పూర్వజన్మ సుకృతమే.*

*శ్రీరామక్షేత్రాలు అన్నింటా సీతారామ కల్యాణం మిట్టమధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో చేయడం సంప్రదాయం. అందుకు విరుద్ధంగా ఒంటిమిట్టలో శుక్ల పక్ష చతుర్దశినాటి రాత్రి పండువెన్నెల్లో రామకల్యాణం నిర్వహిస్తారు. అలా రాత్రిపూట వెన్నెల్లో స్వామివారి కల్యాణం నిర్వహించడానికి ఆసక్తికరమైన గాథ ఒకటి ప్రచారంలో ఉంది. చిన్నతనం నుంచి శ్రీరాముడికి చంద్రుడంటే అత్యంత ఇష్టం. చందమామ అచ్చంగా కావాలని మారాం చేసిన బాలరాముడికి అద్దంలో చందమామను చూపెట్టిన* *గాథ అందరికీ తెలిసినదే. అటువంటి శ్రీరాముడి కల్యాణం మధ్యాహ్నం జరిగింది. దీనితో చంద్రుడు శ్రీరామ కల్యాణం చూడలేకపోయాడు. తీవ్రమైన దుఃఖానికి, బాధకు లోనయ్యాడు. ఈ విషయం శ్రీరాముడికి తెలిసి చంద్రుడిని ఓదార్చి మూడువరాలు ప్రసాదించాడు. ఆ వరాలేమిటంటే, రామభద్రుడు ఆనాటి నుంచి శ్రీరామచంద్రుడిగా ప్రసిద్ధుడు కావడం. తరువాతి జన్మలో శ్రీకృష్ణునిగా రాత్రిపూట జన్మించడం. కలియుగంలో రాత్రిపూట కల్యాణం చేసుకోవడం. అలా చంద్రుడికిచ్చిన మూడోవరంలో భాగంగా రాత్రి ఆ సమయంలో చైత్ర పౌర్ణమికి ముందురోజు చంద్రుడు ఆకాశం నుంచి చూస్తూ పండువెన్నెల కురిపిస్తూ ఉండగా ఒంటిమిట్టలో రామయ్య కల్యాణం జరుగుతుంది.*




ఒక రీల్ చూసి… ఒక గ్రామం మారిపోయింది 

సోషల్ మీడియాలో చూసిన ఒక చిన్న అవగాహన వీడియో… ఇప్పుడు గుండంపల్లి గ్రామంలో పెద్ద మార్పుకు దారి తీసింది. దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామపంచాయతీ వినూత్నంగా “స్టీల్ బ్యాంక్” ఏర్పాటు చేసి, 500 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందుబాటులో ఉంచింది.

గ్రామంలో జరిగే వివాహాలు, విందు కార్యక్రమాలకు అవసరమైన వారు వీటిని తీసుకెళ్లి ఉపయోగించి… తిరిగి శుభ్రం చేసి ఇస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం గణనీయంగా తగ్గింది.

ఇటీవల వైరల్ అయిన వీడియోల్లో పేపర్ ప్లేట్లపై ఉన్న పాలిథిన్ పొర గురించి వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడి ఆహారం వల్ల ప్లాస్టిక్ కరిగి ఆరోగ్యానికి హానికరం అవుతుందని… పర్యావరణానికి కూడా నష్టం కలుగుతుందని చెప్పారు.

గుండంపల్లి తీసుకున్న ఈ చిన్న నిర్ణయం…
పెద్ద మార్పుకు నాంది పలికింది.

ఒక గ్రామంలో 500 స్టీల్ ప్లేట్లు 20 కార్యక్రమాల్లో వాడితే… 10,000 ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం తగ్గినట్టే. అదే ప్రతి గ్రామం చేస్తే… పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుందో ఊహించండి.

నిర్మల్ జిల్లా పంచాయతీ కార్యాలయాల్లో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి… స్టీల్ వస్తువులనే ఉపయోగిస్తున్నారు. మోదుగ ఆకులతో తయారయ్యే విస్తరాకులు కూడా మంచి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి.

 వీడియోలు చూడటం ఒక్కటే కాదు…
మార్పు మన నుంచే మొదలవ్వాలి.

చిన్న అలవాటు మార్చితే…
పెద్ద ప్రకృతి కాపాడినట్టే. 


యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయ ఆభరణాల దొంగతనం..

*నిందితుడి అరెస్ట్, 230 గ్రాముల సొత్తు స్వాధీనం...*

యడ్లపాడు: భక్తితో నమ్మకంగా కొలిచే ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన వెండి,బంగారు ఆభరణాల దొంగతనంతో సంబంధం ఉన్న కేసులో ఎడ్లపాడు ఎస్సై శివరామకృష్ణ మరియు సిబ్బంది ఓ నిందితుడిని అరెస్ట్ చేసి 230 గ్రాముల వెండి‑బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

*నిందితుడి అరెస్ట్ వివరాలు..*

యడ్లపాడు గ్రామానికి చెందిన 43 ఏళ్ల మద్దుల రమణారావు (తండ్రి: మద్దుల హనుమంతరావు)ను తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న బజారు ప్రాంతంలో 2026, మార్చి 31వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.అతనిపై యడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెం. 17/2026 కింద U/S 303(2), 305(d), 306 BNS సెక్షన్లతో పాటుగా దర్యాప్తు కొనసాగించండంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు.ఆభరణాల దాచిన స్థలం,స్వాధీనం అరెస్ట్ అనంతరం తన వాంగ్మూలంలో నిందితుడు దొంగిలించిన ఆస్తులను కనమర్లపూడిలోని శ్రీహరిరావు ఇంటి వద్ద దాచినట్లు తెలిపాడు. దీనిమేరకు దర్యాప్తు అధికారి మధ్యవర్తుల సమక్షంలో సంబంధిత ప్రదేశానికి చేరుకుని ఆభరణాలను సీజ్ చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న ఆభరణాలన్నీ యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన చోరీ సొత్తే అని అధికారులు గుర్తించారు.

*స్వాధీనమైన ఆభరణాల వివరాలుసీజ్..*

వెండి వస్తువులు (మొత్తం 216 గ్రాములు)తమలపాకుల తోరణం – 142 గ్రాములునామాలు మరియు నేత్రాలు – 42 గ్రాములురెండు జతల ఉత్తర జంద్యాలు – 14 గ్రాములుమెట్టెలు మరియు పిల్లేళ్లు – 20 గ్రాములుబంగారు ఆభరణాలు (మొత్తం 14 గ్రాములు)మంగళసూత్రం – 4 గ్రాములురెండు జతల బంగారు నేత్రాలు – 10 గ్రాములుపై ఆస్తులను ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గుర్తించి, తదుపరి దర్యాప్తు కోసం పోలీసులు సీజ్ చేశారు. నిందితుడు మద్దుల రమణారావును అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కు తరలించి,కేసులో ఇతర అంశాలు, మధ్యవర్తి పాత్రలపై కూడా క్లుప్త దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు.