Articles by "మా గురించి"
Showing posts with label మా గురించి. Show all posts


 

*చిలకలూరిపేటలో మారుమోగిన గోమాత నామస్మరణ: తహసిల్దార్‌కు హిందూ సంఘాల వినతికార్యక్రమం లొ పాల్గొన్న సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి*


*చిలకలూరిపేట, ఏప్రిల్ 27, 2026:*
భారతీయ సంస్కృతికి మూలస్తంభమైన గోమాతను సంరక్షించుకోవడమే ధ్యేయంగా నేడు చిలకలూరిపేట పట్టణంలో హిందూ సంఘాలు మరియు గో సేవకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ నుండి ప్రారంభమై దేశం నలుమూలలా సాగుతున్న ఈ గోమాత పూజా కార్యక్రమాలు మరియు ర్యాలీల పరంపరలో భాగంగా, నేడు స్థానిక పట్టణంలో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

*ర్యాలీ విశేషాలు:*
భారీ ప్రదర్శన: పట్టణ ప్రధాన వీధుల గుండా వందలాది మంది గో సేవకులు, భక్తులు గోమాత చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు.

*గోమాత శరణు ఘోష:* ర్యాలీ పొడవునా భక్తులు చేసిన "గోమాత శరణు" నినాదాలతో చిలకలూరిపేట పురవీధులు మారుమోగాయి.

*పూజా కార్యక్రమాలు:* మార్గమధ్యంలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భారతీయ జీవన విధానంలో ఆవు యొక్క ప్రాముఖ్యతను చాటిచెప్పారు.

*వినతిపత్రం సమర్పణ:*
ర్యాలీ అనంతరం హిందూ సంఘాల ప్రతినిధులు స్థానిక
తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. గోవుల సంరక్షణకు కఠిన చట్టాలు అమలు చేయాలని, గోవధను పూర్తిగా నిషేధించాలని కోరుతూ తహసిల్దార్ గారికి వినతిపత్రాన్ని అందజేశారు.

> "గోమాత కేవలం ఒక జంతువు కాదు, అది కోట్లాది మంది భారతీయుల విశ్వాసం. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ చైతన్య యాత్రలో భాగంగా చిలకలూరిపేటలో ఈరోజు భారీ స్పందన లభించింది." అని సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక హిందూ ధర్మ ప్రచారకులు, సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో గో ప్రేమికులు పాల్గొన్నారు.


*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ మరియు కూటమి ఆధ్వర్యంలో  టిడ్కో గృహ సముదాయంలో జరిగిన భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమంనిర్వహించడం జరిగింది*

**చిలకలూరిపేట నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కమిటీ మరియు కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు  వేడుకల్లో భాగంగా *శ్రీరామనవమి 16 రోజుల పండగ వేడుకలుఘనంగా నిర్వహించడం జరిగింది*

*ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం లొ భాగంగా , *52 ఎకరాల టిడ్కో గృహ సముదాయ ఆవరణలో భారీ
అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది*.

*ఈ కార్యక్రమం లొ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కమిటీ సభ్యులు స్థానిక బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు మరియు స్థానిక హిందూ బంధువులు అందరూ కార్యక్రమం లొ పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేసారు*



 

*టీడ్కో హోసింగ్ సముదయం లొ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న  మాజీ మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు సభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు  గారు...*

*శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని 52 ఎకరాలు టిడ్కో గృహ సముదాయంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు  గారు ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.*

కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరైన *పత్తిపాటి పుల్లారావు గారికి కమిటీ సభ్యులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు, నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు, వరికూటి నాగేశ్వరరావు గారు, దడబడ పుల్లయ్య గారు, సింగరేసు పోలయ్య గారు* *వంకాయలపాటి వంశిధర్ గారు* *ఇట్టే శివ నాగేశ్వరావు గారు* *బండారు నరేష్ గారు* *గ్రంధి సుబ్బారావు గారు* తదితరులు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో వారివెంట *తెలుగుదేశం సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా గారు మాజీ మున్సిపల్ చైర్మన్ షైక్ రాఫాని గారు పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి మున్సిపల్ కౌన్సిలర్ జనసేన నాయకులు బిజెపి నాయకులు తెలుగుదేశం నాయకులు మునిసిపల్ కమీషనర్ శ్రీహరి గారు కాపు నాయకులు అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్రమాండాలి సభ్యులు పురుషోత్తమ్మపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్ఎస్ఎస్ కమిటీ సభ్యులు విశ్వహిందూ పరిషత్తు సభ్యులు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం గారు తదితరులున్నారు*



 

*శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...*

*శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని 52 ఎకరాలు టిడ్కో గృహ సముదాయంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.*

కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరైన *మర్రి రాజశేఖర్ గారికి కమిటీ సభ్యులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు, నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు, వరికూటి నాగేశ్వరరావు గారు, దడబడ పుల్లయ్య గారు, సింగరేసు పోలయ్య గారు* *వంకాయలపాటి వంశిధర్ గారు* తదితరులు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో వారివెంట *నిడమానూరు హనుమంతరావు గారు, నరేంద్ర రెడ్డి గారు, విజయ్ గారు* తదితరులున్నారు.




 

52 ఎకరాల టిడ్కో హౌసింగ్ కాలనీలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు – సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి* ఆధ్వర్యం


చిలకలూరిపేట:

*లోకకళ్యాణం కోసం, ధర్మ సంస్థాపన కోసం అవతరించిన మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుని జన్మదినమైన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, చిలకలూరిపేట పరిధిలోని 52 ఎకరాల టిడ్కో (TIDCO) గృహ సముదాయంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించ తలపెట్టాము.*

*ఈ సందర్భంగా చిలకలూరిపేట కూటమి నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ, టిడ్కో నివాసితులందరి సమక్షంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడుతాయని తెలిపారు*

*కార్యక్రమ వివరాలు*

* *వేదిక: 52 ఎకరాల టిడ్కో హౌసింగ్ కాలనీ ప్రాంగణం*

* *ముఖ్య కార్యక్రమాలు: శ్రీ సీతారాముల వారి పూజ, భజన కీర్తనలు మరియు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ*

* *పాల్గొనేవారు: కూటమి ప్రభుత్వం ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు టిడ్కో కాలనీ నివాసితులు*

ముఖ్య ఉద్దేశ్యం:

*రామరాజ్య స్థాపనే లక్ష్యంగా, ప్రజలందరిలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడానికి మరియు టిడ్కో లబ్ధిదారులందరిలో ఐక్యతను చాటడానికి ఈ వేడుకలను నిర్వహిస్తున్నాము. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా టిడ్కో కాలనీ నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామచంద్రుని కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము*

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి ప్రభుత్వం*
*చిలకలూరిపేట నియోజకవర్గం*







సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి విధి విధానాలు

1. హిందూ దేవాలయాల ఆస్తులు భూములు పరిరక్షించడం

2. గోవులను సంరక్షించడం

3. గోశాలల నిర్మాణం

4. హిందూ సమ్మేళనం ఏర్పాటు

5. పురాతన హిందూ దేవాలయాల పునర్  నిర్మాణం

6. గో ఆధారిత పరిశ్రమల ఏర్పాటు

7. ప్రకృతి వ్యసాయం ను అభివృద్ధి చేయుట

8. ప్రకృతిని కాపాడటానికి అవసరం అయినా చెర్యలు తీసుకోవడం

9. ప్రతి గ్రామం లో సంస్థ తరుపున కమిటీలు ఏర్పాటు

10. మండల స్థాయిలో సంస్థ కమిటీలు ఏర్పాటు

11. జిల్లా స్థాయిలో సంస్థ కమిటీలు ఏర్పాటు

12. రాష్ట్ర స్థాయిలో సంస్థ కమిటీలు ఏర్పాటు

13. జాతీయ స్థాయిలో సంస్థ కమిటీలు ఏర్పాటు

14. ఇతర హిందూ ధార్మిక సంస్థలతో కలిసి పనిచేయడం

15. సంస్థ ను విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం

16. స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించడం

17. హిందూ పండుగలను ప్రచారం చేయడం

18. యోగ సెంటర్స్ ఏర్పాటు

19. సమాజ సేవ లో పనిచేస్తున్న వారిని సత్కరించడం

20. ప్రకృతి వ్యసాయం చేస్తున్న రైతు కుటుంబాలను గౌరవించడం

21. హిందూ సమాజం అభివృద్ధికి కృషి చేసిన వారిని గౌరవించడం